E-Paper
Advertisement

AVM Saravanan : ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత..

AVM Saravanan : ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత..
Advertisement

AVM Saravanan : సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన AVM అధినేత శరవణన్ కన్నుమూశారు. తమిళ ఇండస్ట్రీలో ఈ సంస్థకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ నిర్మాణ సంస్థల నుంచి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఏవీఎం ప్రొడక్షన్స్ శరవణన్ వయోభారం కారణంగా గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సను కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ ఆయన తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతగా ఆయన చేసిన సేవలు సినీ ఇండస్ట్రీకి మరుపురానివి. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.. ఆయన నిర్మాణ సంస్థలో నటించిన స్టార్ హీరోలు కుటుంబాన్ని పరామర్శించారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి భారీగా కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీలోని పలువురు హాజరుకానున్నారని సమాచారం..

వయోభారం, అనారోగ్య సమస్యలతో మృతి.. 

ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్‌ నిర్మించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఆయన వయో భారంతో పాటు అనారోగ్య సమస్యలతో గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నా కూడా మళ్లీ మరొక సమస్యతో ఆయన ఇబ్బంది పడేవారట. పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం 3.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు.. ఆయన మరణ వార్తతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఏవీఎం బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 300లకు పైగా సినిమాలను నిర్మించారు.. ఇవాళ సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.

300 లకు పైగా సినిమాలు.. 

Advertisement

శరవణన్‌ తండ్రి, ప్రసిద్థ సినీ దిగ్గజం ఏ.వి. మేయ్యప్పన్‌ 1946లో ఐకానిక్‌ ఏవీఎం స్టూడియోస్‌ను స్థాపించారు. ఆ నిర్మాణ సంస్థను చేయి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తండ్రి తదనానంతరం ఆయన అడుగుజాడల్లోనే ఈయన కూడా నడిచాడు. నిర్మాణ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. ఇక కొన్నిదశాబ్దాలపాటు సినిమా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు. అతని నాయకత్వంలో ఏవీఎం ప్రొడక్షన్స్‌ అనేక భాషల్లో క్లాసిక్‌ చిత్రాలను తెరకెక్కించారు.. తెలుగు భాషలో ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘మెరుపు కలలు’, ‘జెమినీ’, ‘శివాజీ’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. గత కొన్నేలుగా ఈ సంస్థ నుంచి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తమిళ సినిమాకు ఎనలేని సేవలు అందించారని సన్నిహితులు చెబుతున్నారు.. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను ఆయన వారసులు తీసుకున్నట్లు తెలుస్తుంది.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×