E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మను ఊబిలోకి తోసేయనున్న మనోహరి

Nindu Noorella Saavasam Serial Today December 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మను ఊబిలోకి తోసేయనున్న మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

పరుగెత్తుకుంటూ వెళ్తున్న అంజు, ఆనంద్‌ అలిసిపోయి ఒక దగ్గర కూర్చుని ఉంటారు. వాళ్లను వెనక నుంచి తరుముతూ వచ్చిన రౌడీ కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. వెంటనే అమర్‌ వచ్చి రౌడీని కొట్టి చంపేస్తాడు. అమర్‌ను చూసిన పిల్లులు ఊపిరి పీల్చుకుంటారు. హ్యాపీగా ఫీలవుతారు. దీంతో అమర్‌ పిల్లలకు  ధైర్యం చెప్తాడు. భయపడకండి ఇటు వైపు వెళ్లండి. అదిగో అక్కడ చెట్లకు రెడ్‌ క్లాత్‌ కట్టుకుని ఉంటుంది వాటిని ఫాలో అవుతూ వెళితే మన కార్లు వస్తాయి. మీరు అక్కడకు వెళ్లండి. నేను మిగతా వాళ్లను సేవ్‌ చేసి పంపిస్తాను అంటూ పిల్లలను పంపిస్తాడు అమర్‌.

పిల్లలు వెళ్లిపోయాక అమర్‌ ఆకాష్‌, అమ్ము అంటూ గట్టిగా పిలుస్తాడు. ఆ మాటలు మిస్సమ్మకు వినిపిస్తాయి. వెంటనే మిస్సమ్మ ఆయన వచ్చారు అని హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు పరుగెడుతూ ఒక దగ్గర ఆగిపోతారు అమ్ము, ఆకాష్‌. వెనక నుంచి రౌడీ వచ్చి పట్టుకోగానే.. అమర్‌ వచ్చి రౌడీని కొడతాడు. పిల్లలు అమర్‌ను హగ్ చేసుకుంటారు. అమ్ము ఏడుస్తూ డాడ్‌ ఆనంద్‌ అంజు కనిపించడం లేదు అని చెప్తుంది. దీంతో అమర్‌ వాళ్లిద్దరిని నేను కారు దగ్గరకు పంపిచేశాను. సరే మీరు వెంటనే బయలుదేరి కార్లు ఉన్న ప్లేస్‌కు వెళ్లండి. కేర్‌ఫుల్‌ జాగ్రత్తగా వెళ్లండి. నేను మిగతా వాళ్లను తీసుకొస్తాను అని చెప్పగానే.. అమ్ము కంగారుగా డాడ్‌ ఇందాక మిస్సమ్మ గట్టిగా అరిచింది. మిస్సమ్మకు ఏమైందో..? అని చెప్పగానే.. ఎవ్వరికీ ఏమీ కాదు నేను చూసుకుంటాను మీరు వెళ్లండి అని చెప్పగానే అమ్ము, ఆకాష్‌ వెళ్లిపోతారు.

Advertisement

మరోవైపు అడవిలోకి వచ్చిన  ఆరు..  పిల్లలను  వెతుకుతుంది.  అమర్ చెప్పినట్టు కార్ల దగ్గరకు  అంజు, ఆనంద్‌ వెళ్తుంటారు. రెడ్‌ క్లాత్‌ కనిపిస్తుంది. అది చూసిన ఆనంద్‌.. అంజు డాడీ చెప్పిన రెడ్‌ క్లాత్‌ అటు ఉంది అని చెప్పగానే.. అప్పుడే ఒక రౌడీ వాళ్లను పట్టుకోవడానికి వస్తాడు. ఆనంద్‌, అంజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంటారు. ఇంతలో ఒక ఊబి వస్తుంది. ఊబి వైపు పరుగెత్తుకుంటూ వస్తున్న అంజు, ఆనంద్‌లను చూసి ఆరు బాధపడుతుంది. వాళ్లను రావొద్దని చెప్తుంది వాళ్లకు ఆరు మాటలు వినబడవు.. గుప్త గట్టిగా అరవగానే ఆనంద్‌, అంజు ఆగిపోతారు.. వాళ్లను పొడవడానికి వచ్చిన రైడీ ఊబిలో పడిపోతాడు. రౌడీ భయంతో కాపాడండి అంటూ అరుస్తుంటాడు. రౌడీని చూసిన అంజు బాధగా ఆనంద్‌ అతను ఊడిలో కూరుకుపోతున్నాడు పాపం అంటుంది. అవును అంజు అతను చనిపోతాడేమో..? అంటాడు ఆనంద్‌. అవును ఎలాగైనా అతన్ని కాపాడాలి. తనను పైకి లాగాలి అంటుంది అంజు.. దీంతో ఆనంద్‌ మరి అతను పైకి వచ్చాక మనల్ని చంపబోతే.. అంటాడు. అరేయ్‌ ఆనంద్‌ మన కళ్ల ముందు ఒక మనిషి ప్రాణం పోతుంటే అలాగే చూస్తూ ఊరుకుంటామా..? ఆపదలో ఉన్న శత్రువైనా సరే కాపాడాలి అని అమ్మ చెప్పింది కదా ముందైతే అతన్ని కాపాడదాం.. అతను పైకి రాగానే పారిపోదాం అని అంజు చెప్పగానే.. ఆనంద్‌ సరే అంజు ఏదైనా తాడు లాంటిది దొరుకుతుందేమో తీసుకురా అని చెప్తాడు.

ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ రౌడీని సేవ్‌ చేస్తుంటారు. అది చూసిన గుప్త ఆశ్చర్యపోతాడు. ఆహా ఇది కదా పెంపకం అనిన ఇది కదా మానవత్వం అనినా.? నువ్వు మనుషులలో దేవతవు బాలిక. నీ పిల్లపిచ్చుకలకు మంచితనం మానవత్వం నేర్పించితివి.. తమ ప్రాణాలు తీయాలనుకున్న ప్రాణాలనే కాపాడుతున్నారు. ఇంత గొప్ప మాతృమూర్తికి నిష్కారణంగా ఆయుష్షు తీరేలా చేసి మేము మా ప్రభువులు పాపం చేసితిమి.. మమ్మల్ని క్షమించుము బాలిక అని మనసులో బాధపడుతుంటాడు.. ఇంతలో రౌడీ ఊబిలోంచి బయటకు వస్తాడు. అంజు అంకుల్‌ మీకు ఏం కాలేదు కదా..? అని అడుగుతుంది. దీంతో రౌడీ ఏడుస్తూ.. దండం పెడుతూ..నాకేం కాలేదు అమ్మా చిన్న పిల్లలు అయినా నేను మిమ్మల్ని చంపాలి అనుకున్నాను.  కానీ మీరే నా ప్రాణాలు కాపాడారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అమ్మ అంటూ వెళ్లిపోతాడు రౌడీ..

Advertisement

దీంతో ఆనంద్‌ భయంగా అంజు చాలా పెద్ద ప్రమాదం తప్పింది మనకు ఆ దేవుడే మనల్ని కాపాడాడు. కారు దగ్గరకు వెళ్దాం పద అంటూ వెళ్లిపోతారు. పిల్లలు వెళ్లిపోయాక ఆరు గుప్త దగ్గరకు వెళ్లి చాలా థాంక్స్‌ గుప్త గారు మా పిల్లలను కాపాడారు..? అని చెప్పగానే.. నీ పిల్ల పిచ్చుకలను కాపాడింది మేము కాదు బాలిక వారిలోని మంచితనం.. బాలిక తమ ప్రాణాలు తీయాలనుకున్న వారికే నీ పిల్ల పిచ్చుకలు ప్రాణ బిక్ష పెట్టిరి నిజంగా నీ పిల్ల పిచ్చుకలు దేవతలు అని చెప్పగానే.. ఆరు గుప్తగారు మిగతా వారిని వెతుకుదాం పదండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత పులి నుంచి తప్పించుకుని వచ్చిన మిస్సమ్ ఊడి దగ్గరకు వచ్చి నిలబడిపోతుంది. వెనకే వచ్చిన మనోహరి, చంబా ఊబి చూసి మిస్సమ్మను ఊబిలో తోసేయాలని అనుకుంటారు. అనుకున్నట్టే మనోహరి వెనక నంచి వెళ్లి మిస్సమ్మను తోసేయబోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×