Baahubali Documentary: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ‘బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత’ అని చెప్పుకోవచ్చంటే ఆశ్చర్యం లేదు.అలాంటి ఈ సినిమా అప్పుడే థియేటర్లలోకి వచ్చి అప్పుడే దశాబ్దం కాలం దాటిపోయిందంటే నమ్మడం కాస్త కష్టమే. ఎందుకంటే, ఆ సినిమాక్రియేట్ ఇంపాక్ట్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో అలాగే ఉంది. ఒక ప్రాంతీయ తెలుగు సినిమాగా ప్రయాణం మొదలుపెట్టి, బాలీవుడ్ గడ్డపై జెండా పాతడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రూ. 2400 కోట్లకు పైగా వసూళ్ల సునామీ సృష్టించడం బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక అద్భుతం.
ఈ పదేళ్ల ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేస్తూ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసిన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ అనే డాక్యుమెంటరీ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి విజన్‌తో పాటు అమరేంద్ర బాహుబలిగా రెబల్ స్టార్ ప్రభాస్, దేవసేనగా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టిల స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సిరీస్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లాయో ఇందులో కళ్ళకట్టారు.
ఈ డాక్యుమెంటరీలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇరు రాష్ట్రాల అభిమానులను ఏంతో ఆకట్టుకుంటున్న విషయం మాత్రం ప్రభాస్, అనుష్కల రీ-యూనియన్. ‘బిల్లా’ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ క్రేజ్, ‘మిర్చి’ చిత్రంతో పీక్స్‌కు చేరి, ‘బాహుబలి’ సిరీస్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది. వెండితెరపై వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని చూసి, ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వాలని కోరుకునే ఫ్యాన్స్ కోట్లల్లో ఉన్నారు.
also read:కళ్లముందే తిరిగిన మిత్రుడు ఇక లేడు…భాగ్యరాజ మృతిపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
అయితే, తామిద్దరం కేవలం ప్రాణస్నేహితులం మాత్రమేనని ఈ స్టార్స్ పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ, వారిపై వచ్చే రూమర్స్ ఎప్పుడూ తగ్గుముఖం పట్టలేదు. ముఖ్యంగా అనుష్క గత కొంతకాలంగా పబ్లిక్ లైఫ్‌కు, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుండటంతో, ఆడియన్స్ కి కనబడటమే కష్టమైంది. అలాంటిది చాలా ఏళ్ల విరామం తర్వాత ప్రభాస్, అనుష్క ఒకే ఫ్రేమ్‌లో పక్కపక్కన కూర్చొని ముచ్చటించడం అభిమానులకు ఐ-ఫీస్ట్‌లా మారిందనే చెప్పాలి.
ఈ తాజా వీడియోలో అనుష్క సాంప్రదాయబద్ధమైన గ్రీన్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఎంతో హుందాగా, కలర్‌ఫుల్‌గా మెరిసిపోతుండగా, ప్రభాస్ ఎప్పటిలాగే క్లాసీ బ్లాక్ డ్రెస్‌లో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. వీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న విజువల్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా మేకింగ్ కోసం రానా దగ్గుబాటి, తమన్నా, నిర్మాత శోభు యార్లగడ్డ పడిన కఠిన శ్రమ ఒక ఎత్తైతే, ఈ ఇద్దరి ఆఫ్-స్క్రీన్ బాండింగ్ మరో ఎత్తు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
also read:‘అఖండ 2’ నష్టాల ఎఫెక్ట్… రూట్ మార్చి పాన్ ఇండియా కథతో వస్తున్న మాస్ డైరెక్టర్!
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన బాహుబలి వెనుక ఉన్న అసలు సిసలైన కష్టాన్ని, తెరవెనుక ఎమోషన్స్‌ను ఆవిష్కరించిన ఈ టార్చ్‌బేరర్ డాక్యుమెంటరీ, ఒక సినిమా ఎలా చరిత్ర సృష్టిస్తుందో చెప్పడానికి పక్కా ఉదాహరణగా నిలిచింది. పదేళ్లు దాటినా తగ్గని ఈ క్రేజ్, ప్రభాస్-అనుష్కల మ్యాజికల్ బాండింగ్ చూస్తుంటే ఈ విజువల్ వండర్ ఎప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఒక స్పెషల్ మెమొరీగానే నిలిచిపోతుందని స్పష్టమవుతోంది.