E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. గోరింటాకు పెట్టుకున్న కోడళ్లు.. పల్లవి పై అవనికి అనుమానం..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. గోరింటాకు పెట్టుకున్న కోడళ్లు.. పల్లవి పై అవనికి అనుమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode august 12th : పూజ బాగా పూర్తయింది కదా ఇక అందరం భోజనం చేద్దాం పదండి అని అందరు కూర్చొని తింటూ ఉండగా మీనాక్షి చేసిన పులిహోరపై ప్రశంసలు కురిపిస్తారు.. మీనాక్షి పులిహోర చాలా బాగా చేసింది. ఆమె వంటకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె చేసిన వంట అలా ఉంది? అద్భుతం అంటూ అందరూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉండగా పల్లవి మాత్రం అశ్వినిచ్చిన జలక్ తో కంగారు పడిపోతూనే ఉంటుంది.. ఎందుకు పల్లవి నువ్వు తినట్లేదు అని మీనాక్షి అడగ్గాని తింటానమ్మా చాలా బాగుంది అని చెప్తుంది.. ఇక అక్కడున్న స్వీట్లు మిస్ అవ్వడంతో కమల్కు భానుమతి పై అనుమానం వస్తుంది. ఇక భానుమతిని వెతుక్కుంటూ బయటికి వెళ్లిన కమల్ తన అనుమానమే నిజమైంది అని ఆ స్వీట్ లని భానుమతి నుంచి తెలివిగా తీసుకుని వచ్చేస్తాడు. భానుమతి ఎంతగా అడిగిన సరే ఒక్క స్వీట్ కూడా ఇవ్వకుండా అందరికీ వడ్డించేస్తాడు కమల్.. ఇక బాబు బాగా ఏడుస్తున్నాడని చూసి ఆరాధ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి అందరూ కూడా బాధపడతారు.

బాబు కోసం ఆరాధ్య కన్నీళ్లు..

బాబు ఊరికే ఏడుస్తున్నాడు అని ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది. బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కావడం లేదు అని అందరూ టెన్షన్ పడుతూ ఉండగా వారికి దిష్టి తగిలి ఉంటుంది అందుకే వాడి ఏడుస్తున్నాడు అని అవని అంటుంది. ఆ మాట వినగానే దిష్టి తీయాలి అని అనుకునే లోపల దిష్టి తీయడానికి తీసుకుని వస్తుంది. బాబుకి దిష్టి తగిలింది నేను దిష్టి తీస్తాను అని ఆరాధ్య దిష్టి తీయడంతో పాటుగా బాబుకి ఏమైందో తెలియడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తమ్ముడికి అసలైన అర్థం కావడం లేదమ్మా ఏం జరిగింది అని ఆరాధ్య బాధపడుతూ ఉంటుంది. ఆరాధ్యను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధ పడిపోతారు. బాబు కోసం ఆరాధ్య చాలా బాధపడుతుంది అని అనుకుంటారు..

బాబు అదృష్టవంతుడు..

Advertisement

తనకి ఏమైనా అని ఆరాధ్య టెన్షన్ పడిపోతూ ఉండడం చూస్తున్న అక్కడున్న వాళ్ళందరూ కూడా బాబు చాలా అదృష్టవంతుడు అమ్మ లాంటి అక్క దొరకడం అని అనుకుంటారు. పెద్దయిన తర్వాత అక్క తమ్ముళ్ల మధ్య అనుబంధం పెరుగుతుంది.. కానీ చిన్నప్పటినుంచి ఇలాంటి అలవాట్లు ఉండడం నిజంగా గ్రేట్ అంటూ అవన్నీ వాళ్ళందరూ కూడా ఆరాధ్య అలా బాధ పడిపోతుంది అని వాళ్ళు కూడా బాధపడతారు. ఎలాగైనా సరే బాబుకి తగ్గిపోవాలి అని ఆరాధ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మీ తమ్ముడు చాలా గొప్పవాడు నీలాంటి మంచి అక్క దొరకడం వాళ్ళ అదృష్టవంతుడు పార్వతి అనడంతో బాబుకి ఏం కాలేదు కదా అని అనుకుంటుంది.. చిన్నపిల్లలు ఎప్పటి నుంచి అందుబాటులో నేర్చుకుంటే పెద్దిన తర్వాత వాళ్ళకి కుటుంబ విలువలు కూడా తెలుస్తాయి అని అంటారు.

పల్లవికి టెన్షన్ టెన్షన్..

పల్లవి అశ్విన్ఇంటికి తర్వాత కావడం లేదు. వాడు నన్ను ఏదోకటి చెయ్యాలనే ప్లాన్ చేస్తున్నారు. అందుకే నేరుగా ఇంటికి వచ్చేసాడు అంటే నెక్స్ట్ టైం ఇంకా ఎలాంటి ప్లాన్ చేస్తాడు అని పల్లవి టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. వీడి పీడ తిరగడం ఎలా చేసుకోవాలి లేదంటే మాత్రం నేను చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆలోచిస్తుంది. అశ్విని ఏం చేయాలనుకుంటున్నారు. అసలు వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకోవాలి అని పల్లవి అటు ఇటు తిరుగుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది అని మీనాక్షి గోరింటాకు తీసుకునే వస్తుంది. మీరందరూ రండి అని మీనాక్షి పిలవడంతో అందరూ రెడీ అవుతుంటారు. ఏమైంది ఎందుకు మా అమ్మ పిలుస్తుంది అని అనుకుంటారు.

గోరింటాకు విశిష్టత చెప్పిన అవని..

Advertisement

మీనాక్షి అందరూ రండి మీ కోసం నేను గోరింటాకు తెచ్చాను అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషంగా వస్తారు. కానీ పల్లవి మాత్రం గోరింటాకు పెట్టుకొని ఎంత చెప్తున్నా సరే టెన్షన్ పడిపోతూ కనిపిస్తుంది. ఏంటి ఏమైంది పల్లవి ఎలా ఉన్నావు అని అవని అడుగుతుంది. ఏమీ లేదు అక్క నాకు ఏమీ కాలేదు అని చెప్పగానే పల్లవి ఎందుకు కంగారు పడిపోతుంది అని అనుకుంటుంది. గోరింటాకు గురించి మీనాక్షి చక్కగా చెప్తుంది. కానీ అవని మాత్రం చెప్పిన మాటలు హైలెట్గా నిలుస్తాయి. ఆషాడ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం గనక ఇంత అర్థం ఉందా అన్నది ఇప్పుడు తెలిసింది. కచ్చితంగా మనం గోరింటాకు పెట్టుకోవాల్సిందే అని అందరూ కూడా చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు.

అవనితో అక్షయ్ గొడవ..

అవని ఇంకా రాలేదు అని అక్షయ్ రూంలో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవన్నీ చేతులకు గోరింటాకు పెట్టుకొని చూపిస్తుంది. అసలు దగ్గరికి వెళ్లావు ఇంతసేపు ఏం చేస్తున్నావ్ నీ కోసం నేను ఎదురు చూస్తానని తెలుసు కదా అని అవనితో ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించిన సరే తను మాత్రం అస్సలు వినకుండా ఉంటాడు. పల్లవి ఏదో టెన్షన్ లో ఉందండి పల్లవి గురించి మనం పట్టించుకోవాలి అని అంటుంది. ఇప్పుడు చూసిన వాళ్ల గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు నా గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు అని అక్షయ సీరియస్ అవుతాడు. అక్షయ్ ఎంత చెప్పినా కూడా అవని వినకుండా మాట్లాడడంతో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ నాకు అర్థం కావడం లేదు అని పై సీరియస్ అవుతాడు అక్షయ్. అయితే నువ్వు ఎలాగైతే మాట్లాడలేదు నేను కూడా అలానే రెండు రోజులు నీతో మాట్లాడను అని చెప్తాడు అక్షయ్. అవని ఎంతగా ప్రయత్నం చేసిన సరే అక్షయ మాత్రం నీతో మాట్లాడను అని తేల్చి చెప్పేస్తాడు.

భానుమతిని ఆడుకున్న కమల్..

భానుమతి నాకు బీపీ టాబ్లెట్లు అయిపోయాయి అని కమల్ దగ్గరికి వెళ్తుంది. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను కదా వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అని చెప్తాడు. కానీ నాకు ఇప్పుడే వెళ్లి తీసుకురావాలి అని చెప్పగానే ఏంటో ఇంత మొండిగా ఉన్నావు. ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అని కమల్ అంటాడు.. నీకు బీపీ టాబ్లెట్లు తీసుకురావాలా? దానికోసం అమ్మకు చెప్పడం ఎందుకు తీసుకొని వస్తాను అని కమల్ ఎంతగా చెప్తున్నా సరే వినకుండా మాట్లాడడంతో. భానుమతిని ఒక ఆట ఆడుకుంటాడు. ఇంట్లోకి కుక్కలు వచ్చాయి అని భానుమతితో ఒక ఆట ఆడుకుంటాడు కమల్.. ఇక భానుమతి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కమల్ పని ఇది అని తెలుసుకొని కంగారు పడిపోతుంది. ఇక పల్లవి కి ఫోన్ రావడంతో అవని ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చూసే లోపల పల్లవి ఫోన్ తీసుకుంటుంది. ఒకటికి నాలుగు సార్లు ఫోన్లు చేస్తున్నారేంటి ఎవరు అసలు అని చెప్పగానే అశ్విన్ ఫోన్ చేశాడని తెలుసుకున్న పల్లవి నేను చూసుకుంటాను అక్క అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ప్రేమ మాటకు షాక్.. అయ్యో ప్రేమ..

Brahmamudi Serial Today Episode August 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యకు మత్తు మందు ఇచ్చి బెడ్రూంలోకి తీసుకెళ్లిన శశి

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

హీరో శ్రీకాంత్ డైలీ ఇంట్లో ఇలాగే చేస్తారా?

నాకు కన్నీళ్లు ఆగలేదు.. ఆ ఒక్కటి చూసి షాక్ అయ్యాను..

13 ఏళ్లుగా యాంకర్ ప్రదీప్ పై ప్రేమ.. ఎట్టకేలకు ఓపెన్ అయిన బ్రహ్మముడి సీరియల్ నటి!

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..బిగ్ బాస్ 10 లోకి కన్నడ హీరోయిన్..

Big Stories

Advertisement
×