E-Paper
Advertisement

హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?

హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?
Advertisement

Donald Trump: భారత్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల ఓ కీలక పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ (Donald Trump Avenue)గా నామకరణం చేసింది. ఈ గౌరవంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

‘నేనే మొదటివాడిని’

హైదరాబాద్‌లోని రోడ్డుకు తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు ‘భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటయింది. ఈ రకమైన గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి యూఎస్ ప్రెసిడెంట్‌ను నేనే. థాంక్యూ!’ అని ట్రంప్ రాసుకొచ్చారు.

యూఎస్ రాయబారితో కలిసి..

Advertisement

ఈ నెల 23న అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన శీలాఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తో కలిసి తెలంగాణ డిప్యూటీ సీం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అమెరికా – భారత్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో బలమైదంటూ ఈ సందర్భంగా ఇరువులు నేతలు చెప్పుకొచ్చారు.

Also Read: వైభ‌వ్ ఇంకా స్కూల్ కు వెళ్లే పిల్లాడే, ఘోరంగా అవ‌మ‌నించిన ఐసీసీ

ట్రంప్ పేరు వెనుక వ్యూహాం!

Advertisement

ఈ ప్రతిష్టాత్మక ట్రంప్ రహదారి కేవలం అమెరికా కాన్సులేట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ ఐటీ హబ్‌గా దూసుకుపోతున్న హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google), అమెజాన్ (Amazon) వంటి దిగ్గజ అమెరికన్ టెక్నాలజీ కంపెనీల కార్యాలయాలకు అత్యంత సమీపంలో ఈ ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఉండటం విశేషం. ఇది వ్యూహాత్మకంగా, వ్యాపారపరంగా ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని అమెరికన్ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

త్వరలో మరిన్ని రోడ్లు!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి.. తొలిసారి ఈ ట్రంప్ రోడ్ ప్రతిపాదన చేశారు. అనంతరం దిల్లీలో యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను సైతం తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Also Read: ఉండవల్లి భూముల రగడ.. ప్రపంచ బ్యాంకుకు రైతుల ఫిర్యాదు.. సీఆర్డీఏకు ఆదేశాలు!

Related News

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్.. తమిళనాడు మాదిరి మార్పు ఎక్కడ?

తెలంగాణలో ‘సర్’ టెన్షన్.. 21 శాతం ఓట్లు పోయే ఛాన్స్, నేతలకు సీఎం రేవంత్ కీలక సూచనలు

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు

వాళ్లు క్షుద్ర పూజలు చేశారు.. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు! కూకట్‌పల్లిలో రేవంత్ సంచలనం!

స్వేచ్ఛ ఓకే.. విద్వేషం నాట్ ఓకే.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్

బొగ్గు, సిమెంట్ ధరలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన.. రాష్ట్రాల హక్కులపై క్లారిటీ!

వీడెక్కడి దొంగరా బాబు.. దొంగతనం చేసిన ఇంట్రోనే నిద్రపోయాడు!

Big Stories

Advertisement
×