E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యకు మత్తు మందు ఇచ్చి బెడ్రూంలోకి తీసుకెళ్లిన శశి

Brahmamudi Serial Today Episode August 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యకు మత్తు మందు ఇచ్చి బెడ్రూంలోకి తీసుకెళ్లిన శశి
Advertisement

Brahmamudi serial today Episode: శశికి రింగ్‌ గిఫ్టుగా ఇచ్చిన ఐశ్వర్యతో తాను ఇప్పటి వరకు ఎంత ఖరీదైన గిఫ్ట్స్‌ వచ్చినా థ్రిల్‌ అనిపించలేదు కానీ నువ్వుచ్చిన  రింగ్‌ నాకు స్పెషల్‌ అంటూ ఇక కేక్‌ కట్‌ చేద్దామా..? అనగానే.. ఐశ్వర్య అదేంటి ఎవ్వరూ రాలేదు అప్పుడే కేక్‌ కట్‌ చేస్తావా..? అని అడిగితే ఎవ్వరూ రారు ఎందుకంటే ఇది నీకు చాలా స్పెషల్‌ కదా అందుకే నా పనులన్నీ పక్కన పెట్టి ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చాను సో ఈ బర్తుడే నాకు చాలా స్పెషల్ నీకు కూడా చాలా స్పెషల్‌ ఈరోజు నుంచి నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా మారుస్తాను. అంటూ నువ్వు కళ్లు మూసినా కళ్లు తెరచినా ఈ మూమెంటే నీ కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. అందుకే ఈ పార్టీకి నేను ఎవ్వరినీ ఇన్వైట్‌ చేయలేదు.. అందుకే నువ్వు నేను మాత్రమే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం.. అని చెప్పగానే.. ఐశ్వర్య మనసులో వీడు ప్రపోజ్‌ చేయడానికి బాగానే ప్రిపేర్‌ అయ్యాడు అనుకుంటుంది.

రేణు ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతుంటే.. ఇందు, నందు వెళ్తారు. కోపంగా రేణును తిడుతూ.. శశికి మా ఐషు గురించి ఇలాగే చెప్పావా అంటూ ప్రశ్నించగానే.. ఈరోజు శశి బర్తుడే ఐషు ఆ పార్టీకే వెళ్లింది అని చెప్పగానే.. మరి నువ్వెందుకు వెళ్లలేదు అని ఇందు అడిగితే.. వాడు ఇవాళ ఐషుకు ప్రపోజ్‌ చేస్తున్నాడు.. అందుకే వాళ్లను డిస్టర్బ్‌ చేయడం ఎందుకని వెళ్లలేదు అని చెప్పగానే.. నందు ఫోన్‌ తీసుకుని సోషల్‌ మీడియాలో శశి ప్రొఫైల్‌ చెక్‌ చేసి ఇవాళ శశి బర్తుడే కాదు కదా.. అసలు ఈ మంతే కాదు కదా.? మన అక్క ఎంత పిచ్చిది కాకపోతే ఇది కూడా గమనించకుండా వెళ్లిందా..? అంటూ నందు అంటుంటే.. ఈరోజు బర్తుడే కాకపోయినా ఎందుకు సెలబ్రేట్‌ చేస్తున్నాడు అంటూ ఇందు అడిగితే లేదు ఇవాళ శశి బర్తుడేనే.. అంటుంది రేణు. నందు కోపంగా రేణు చెంప పగులగొడుతుంది. ఇప్పుడు నిజం చెప్తవా..? ఇంకా రెండు తగిలించాలా అని అడిగితే… రేణు నిజం చెప్తుంది. ఇవాళ వాడి బర్తుడే కాదని వాడి కన్ను పడిన ఏ అమ్మాయిని అసలు వదిలిపెట్టడు అంటూ చెప్తుంది. బర్తుడే పార్టీ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని లోకేషన్‌ తీసుకుని రేణుకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు.

Advertisement

బర్తుడే కేక్‌ కట్‌ చేసిన తర్వాత శశి రోజ్‌ ఐశ్వర్యకు ఇస్తూ ప్రపోజ్‌ చేస్తాడు. ఐశ్వర్య కూడా శశికి ఐలవ్‌యూ టూ అంటూ హగ్‌ ఇస్తుంది. ఈ హ్యపీ మూమ్‌మెంట్‌ను ఫుల్‌గా చిల్‌ చేద్దాం ఒక్క నిమిషం డ్రింక్స్‌ తీసుకొస్తాను అంటూ శశి లోపలికి వెళ్లి డ్రింక్స్‌ కలుపుతూ అందులో మత్తు మందు కలుపుతాడు. ఇదే నిన్ను పూర్తిగా నా సొంతం చేసే ఆయుధం.. ఇది నువ్వు పూర్తిగా తాగే వరకు నేను ఓపిక పట్టాలి ఆ తర్వాత నిన్ను పూర్తిగా అనుభవించేస్తాను అనుకుంటూ డ్రింక్స్‌ తీసుకెళ్లి ఐశ్వర్యకు ఇస్తాడు శశి. డ్రింక్స్‌ తాగిన ఐశ్వర్య మత్తుగా పడిపోయాక బెడ్‌రూంలోకి తీసుకెళ్లి ఐశ్వర్యతో ఫిజికల్‌గా కలవబోతుంటే.. ఇందు వచ్చి శశిని లాగేసి కొడుతుంది. శశి కోపంగా నాకు భలే దొరికింది వన్‌ ఫ్లస్‌ వన్‌ అనగానే.. వెనక నుంచి వచ్చిన నందు వన్ ప్లస్‌ వన్‌ కాదు.. వన్‌ ప్లస్ టూ అంటుంది. నందు శశిని కొడుతుంది. శశి కింద పడిపోగానే.. ఇందు, నందు ఐషును తీసుకెళ్తుంటారు.

తర్వాత ఇంట్లో వాళ్లు అందరూ ఐశ్వర్యను తిడుతుంటే.. నా బతుకేదో నేను బతుకుతుంటే.. ఎందుకు నన్ను ఫాలో అవుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ అందరినీ తిడుతుంది. నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నీకేం హక్కు ఉంది అంటూ ఇందు అడిగితే.. రాజు అక్కా చెల్లెల్ల బంధం ఉంది అది కాపాడుకోవడానికి ఇలా చేస్తుంది అంటే ఐశ్వర్య కోపంగా రాజును తిడుతూ.. మీరెంత చెప్పినా నేను వినను.. ఎందుకంటే సొంతవాళ్లు అనుకునే మీరంతా పరాయివాళ్లే.. పరాయి వాళ్లు అనుకునే నా ఫ్రెండ్స్‌ అంతా నాకు సొంత వాళ్లు అంటూ చెప్తుంటే.. నందు కోపంగా తిడుతూ… రేణును తీసుకొచ్చి నిజం చెప్పిస్తుంది. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Big Stories

Advertisement
×