Baahubali Spoofs Coldplay Viral Video: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా మూవీ బాహుబలి. ఈ ఏడాదిలో ఈ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధించిన ముచ్చట్లే కనిపిస్తున్నాయి. ఈ మూవీ గురించి ప్రధాన పాత్రలు షేర్ చేసుకున్న విశేషాలు వైరల్ గా మారాయి. మొన్నటి వరకు బాహుబలి మూవీ వైరల్ కాగా.. ఇప్పుడు తాజాగా ఓ సంఘటనతో బాహుబలి చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల ఓ కన్సర్ట్ ఓ కంపెనీకి సీఈవో, హెచ్ఆర్ చీఫ్ లు అనుకోని స్థితిలో కెమెరాకు చిక్కారు.
సీఈవో గా ప్రభాస్, హెచ్ ఆర్ అనుష్క
ఈ ఇన్స్ డెంట్ బాహుబలిలోని ఓ సన్నివేశానికి లింక్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ తీసుకువస్తున్నారు. ప్రభాస్, అనుష్క లు కౌగిలించుకుని ఉన్న పోస్టర్ షేర్ చేస్తూ మాహిష్మతి సీఈవో, హెచ్ ఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో కోల్డ్ ప్లే లో అచ్చం వారద్దరు కౌగిలించుకుని ఉన్నట్టు అనుష్క, ప్రభాస్ లు పోస్టర్ ఉంది. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తుండగా.. ఫ్యాన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పనిని బాహుబలి లాంటి ప్రతిష్టాత్మకమైన సినిమాతో పోల్చడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం కోల్డ్ ప్లే కన్సర్ట్ వర్సెస్ భల్లాలదేవా
కోల్డ్ ప్లే పై బాహుబలి స్పూఫ్
కాగా సోషల్ మీడియా వల్ల సామాన్య ప్రజలు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు గా మారుతున్నారు. అనుకొని పరిస్థితుల్లో దొరికిపోయి సెలబ్రిటీల వార్తల్లో నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల కారణంగా కొందరి లైఫ్ అనుకోని విధంగా టర్న్ తీసుకుంటే.. మరికొందరి బుక్కై అవమానాల పాలవుతున్ానరు. ఇప్పుడు అలాంటి జాబితాలోనే నిలిచారు ఓ కంపెనీ సీఈవో, హెచ్ ఆర్ ఛీఫ్. ఇటీవల లండన్ లో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్ కు ఓ ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో, అదే కంపెనీ హెచ్ ఆర్ చీఫ్ హాజరయ్యారు. కన్సర్ట్ జరుగుతున్న సమయంలో వారిద్దరు కౌగిలించుకుని అత్యంత సన్నిహితంగా మెదిలారు. దీంతో వారిని గుర్తించిన కెమెరా మ్యాన్ లెన్స్ ని వారిపై తిప్పాడు.
Also Read: HHVM Pre Release Event: బ్లాకులో ‘హరిహర వీరమల్లు’ ప్రి రిలీజ్ పాస్‌లు.. ఏకంగా రూ.4 వేలా? వామ్మో!
సిగ్గుతో దాక్కున్న సీఈవో, హెచ్ఆర్
దీంతో కన్సర్ట్ లో ఎల్ ఈడీ స్క్రీన్ అన్నింటిలో వారి విజువల్సే దర్శనం ఇచ్చాయి. అది చూసిన వారు ఒక్కసారిగా నాలుక కరుచుకుని సిగ్గుతో తల దాచుకున్నారు. ఇద్దరు వివాహితులే కావడంతో ఈ వ్యవహరం నెట్టింట చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోపై కోల్డ్ ప్లే క్రిస్ మార్టిన్ ఈ వీడియో స్పందిస్తూ.. ‘వారు అఫైర్ లో ఉండి ఉండాలి, లేదా సిగ్గుతో దాక్కోని ఉండాలి’ అని కామెంట్ చేశారు. అయితే ఈ సంఘటన కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం కాలేదు. ఈ ఇన్సిడెంట్ వల్ల పరువు పోవడంతో సదరు సీఈఓ ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సీఈఓ ఆండీ బైరోన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సదరు కంపెనీ ఎక్స్ లో వేదికగా ప్రకటించింది. సోషల్ మీడియా జరిగిన ఇలాంటి సంఘటనను నెటిజన్స్ బాహుబలితో లింక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.