BigTV English

OTT Movie : ట్రిప్పుకని వెళ్తే పార్ట్స్ ప్యాకయ్యే ఎక్స్పీరియన్స్… ఎవ్వరినీ వదలని దెయ్యాలు … రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ సీన్స్

OTT Movie : ట్రిప్పుకని వెళ్తే పార్ట్స్ ప్యాకయ్యే ఎక్స్పీరియన్స్… ఎవ్వరినీ వదలని దెయ్యాలు … రోమాలు నిక్కబొడుచుకునే హర్రర్ సీన్స్

OTT Movie : షాకింగ్ ట్విస్ట్‌లు, ఒక ఇంటెన్స్ ఎమోషనల్ డెప్త్ తో తెరకెక్కిన ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను భయపెట్టిస్తోంది. ఈ సినిమా స్టోరీ ఒక ఒంటరిగా ఉండే ఒక లాడ్జ్‌లో స్టెప్‌మదర్, ఆమె ఫియాన్సీ ఇద్దరు పిల్లల మధ్య జరిగే భయానక సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా హెరెడిటరీ, ది షైనింగ్ వంటి చిత్రాలతో పోలికను కలిగిఉంటుంది. దాని డార్క్ టోన్, క్లాస్ట్రోఫోబిక్ సెట్టింగ్, సైకలాజికల్ టెన్షన్ కారణంగా ఈ సినిమా సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘ది లాడ్జ్’ (The Lodge) 2019 లో విడుదలైన ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. దీనికి వెరోనికా ఫ్రాంజ్, సెవెరిన్ ఫియాలా దర్శకత్వం వహించారు. రిలే కియో, జేడెన్ మార్టెల్, లియా మెక్‌హగ్, రిచర్డ్ ఆర్మిటేజ్, అలిసియా సిల్వర్‌స్టోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 48 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.0/10, రాటెన్ టొమాటోస్‌లో 75% రేటింగ్ ను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా లారా హాల్ తో మొదలవుతుంది. ఆమె తన భర్త రిచర్డ్ నుండి విడిపోయి ఉంటుంది. రిచర్డ్, ఒక రచయిత, తన కొత్త ఫియాన్సీ గ్రేస్ మార్షల్ తో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమె ఒక ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్ కల్ట్‌లో పెరిగిన ఏకైక సర్వైవర్. అందులో ఉన్న సభ్యులంతా సామూహిక ఆత్మహత్య చేసుకుంటారు. ఇక రిచర్డ్ పెళ్ళి విషయాన్ని లారాకు తెలియజేయగానే, ఆమె షాక్‌లో ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ప్రభావం ఆమె పిల్లలు ఎయిడెన్, మియాపై తీవ్రంగా పడుతుంది. ఆరు నెలల తర్వాత, థాంక్స్‌గివింగ్ సమయంలో, రిచర్డ్ తన పిల్లలతో కలిసి క్రిస్మస్ సెలవుల కోసం మసాచుసెట్స్‌లోని ఒక లాడ్జ్‌కు గ్రేస్‌తో వెళ్లాలని అనుకుంటాడు. వారు ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి ఈ ట్రిప్ ఉపయోగపడుతుందని భావిస్తాడు. ఎయిడెన్, మియా తమ తల్లి మరణానికి గ్రేస్‌ను నిందిస్తూ, ఆమె పట్ల శత్రుత్వంగా వ్యవహరిస్తారు. వీళ్ళు గ్రేస్ గతాన్ని ఆన్‌లైన్‌లో చూస్తారు. ఆమె కల్ట్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుంటారు. అందులో సభ్యుల వీడియో ఫుటేజ్‌ను కూడా చూస్తారు.

ఈ క్రమంలో రిచర్డ్ ఒక వర్క్ కమిట్‌మెంట్ కోసం నగరానికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. గ్రేస్‌ దగ్గరే ఎయిడెన్, మియాను వదిలి వెళ్తాడు. ఆతరువాత ఒక భీకరమైన స్నోస్టార్మ్ వారిని లాడ్జ్‌లో బంధిస్తుంది. పిల్లలు ఆమెతో కలసి ఉండేందుకు ఇబ్బంది పడుతుంటారు. ఇంతలో గ్రేస్ స్నానం చేస్తుండగా ఎయిడెన్ చూసినందుకు ఆమె అతనిని మందలిస్తుంది. అయితే ఎయిడెన్ ఆమెకు కోక్ ఇచ్చి కూల్ చేస్తాడు. తర్వాత ఉదయం, గ్రేస్ ఒక వింత స్థితిలో మేల్కొంటుంది. ఆమె బట్టలు, ఆమె కుక్క, ఇతర వస్తువులు కనిపించకుండాపోతాయి. లాడ్జ్‌లో విద్యుత్, నీరు కూడా ఆగిపోతాయి. గ్రేస్ ఆందోళనకు గురవుతుంది. ఆమె మందులు లేకపోవడం, ఆకలి, చలితో బాధపడుతుంది. ఆమె సమీప ఊరికి నడవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె చివరికి తిరిగి లాడ్జ్‌కే చేరుకుంటుంది. స్నోలో దాచబడిన ఒక మెమోరియల్ ఫ్రేమ్‌లో ఎయిడెన్, మియా ఫోటోను గ్రేస్ కనుగొంటుంది. లోపల కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ వల్ల ఈ ముగ్గురూ చనిపోయినట్లు ఒక వార్తా పత్రిక కథనాన్ని చూస్తుంది. ఎదో దుష్ట శక్తి ఈ పనులు చేస్తుందని ఆమె భయపడుతుంది.

ఈ సినిమా షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, ఈ అసాధారణ సంఘటనలన్నీ ఆమె టీలో డ్రగ్స్ కలిపిన తరువాత జరుగుతాయి. ఆ తరువాత రిచర్డ్ తిరిగి వచ్చినప్పుడు, గ్రేస్ పూర్తిగా కంట్రోల్ తప్పుతుంది. అతన్ని తుపాకీతో కాల్చి చంపుతుంది. ఎయిడెన్, మియా కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ స్నోలో చిక్కుకుంటారు. గ్రేస్ వారిని తిరిగి లాడ్జ్‌లోకి బలవంతంగా తీసుకువస్తుంది. వారిని తన తండ్రి మృతదేహం పక్కన డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టి, వారి నోటిపై “సిన్” అని రాసిన డక్ట్ టేప్‌ను అతికిస్తుంది. ఆమె తుపాకీని వాళ్ళకేసి గురిపెడుతుంది. ఇంతకీ గ్రేస్ ఆ పిల్లలను ఏం చేస్తుంది ? ఆ లాడ్జ్‌లో దుష్టశక్తి ఉందా ? గ్రేస్ గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమానుచూసి తెలుసుకోండి.

Read Also : కొడుకు ముందే తల్లితో ఆ పాడు పని… వాడిచ్చే షాక్ కు ఫ్యూజులు అవుట్… యాక్షన్ ప్రియులు మస్ట్ వాచ్

Related News

SU from SO OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×