RK Sagar: ఆర్కే సాగర్(R.K Sagar) అంటే గుర్తుపట్టక పోవచ్చు కానీ ఆర్కే నాయుడు(R.K Naidu) అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకొస్తారు. ఆర్కే నాయుడు పేరు చెప్పగానే మొగలిరేకులు(Mogalirekulu) సీరియల్ గుర్తుకు వస్తుంది. జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ ఎంతో మంచి ప్రేక్షకు ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు ఆర్కే సాగర్. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన తదుపరి ఎలాంటి సీరియల్స్ చేయకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఇలా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన సాగర్ ప్రస్తుతం హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
మొగలిరేకులు ఆర్కే నాయుడు..
ఈయన ది 100 (The 100)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 11వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆర్కే సాగర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
రంగస్థలం సినిమాలో అవకాశం..
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్ తన సినీ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మిస్టర్ పర్ఫెక్ట్(Mr. perfect) సినిమాలో తనకు సెకండ్ లీడ్ రోల్ అని చెప్పి తీసుకున్నారని తీరా చూస్తే నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశానని తెలిపారు. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రాంచరణ్ (Ramcharan)హీరోగా నటించిన రంగస్థలం (Rangasthalam)సినిమాలో తనకు చరణ్ అన్నయ్య పాత్రలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. సుకుమార్ గారు నన్ను కలిసి ఈ విషయం చెప్పడంతో నేను మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా విషయంలో ఎదురైన అనుభవాన్ని తెలియజేశాను.
ఆది పినిశెట్టి పాత్రలో..
ఇలా నా అభిప్రాయాన్ని తెలియజేయడంతో సుకుమార్ గారు వెంటనే మరో హీరో ఆది పిన్నిశెట్టినీ (Aadi Pinisetty)సంప్రదించారు. ఇక ఈ పాత్ర గురించి నేను బాగా ఆలోచించి, నా నిర్ణయం చెప్పేలోపు ఆది పినిశెట్టి గారు ఈ సినిమాకు ఓకే చెప్పడంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయాను అంటూ సాగర్ ఈ సందర్భంగా తెలియజేశారు. సుకుమార్ డైరెక్షన్లో కనుక ఈ సినిమా చేసి ఉంటే ఈయన కెరియర్ కు మరింత ప్లస్ పాయింట్ అయ్యేదని అభిమానులు భావిస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ప్రభావంతో ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి. ఇక ఈయన హీరోగా ఇదివరకే సిద్దార్థ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, షాదీ ముబారక్ వంటి సినిమాలలో హీరోగా చేశారు అయితే ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆయనకు గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. మరి ఇప్పుడు రాబోతున్న ది 100 సినిమా ద్వారా సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. సినిమా చూస్తూనే డైరెక్టర్ మృతి!