Balakrishna..నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు.. నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao)వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రి లాగే స్టార్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుండి మరే హీరో ఆయనంత గుర్తింపు తెచ్చుకోలేరు అనుకుంటున్న సమయంలో బాలకృష్ణ వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.. అలా ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే అలాంటి బాలకృష్ణని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు.
అభిమానులను కొట్టడమే కాదు ఆదుకోవడంలోనూ ముందే..
ముఖ్యంగా ఒక హీరో అయినా.. రాజకీయ నాయకుడైనా జనాల్లో హైలైట్ అవ్వాలంటే దానికి కారణం అభిమానులే.. అభిమానుల వల్లే ఇదంతా జరుగుతుంది. అభిమానులు హీరోలకి, రాజకీయ నాయకులకి అంత గొప్ప స్థానాన్ని ఇవ్వడం వల్లే వారికి ఆ పొజిషన్ వస్తుంది. కానీ అలాంటిది బాలకృష్ణ మాత్రం ఆయన్ని ఎంతగానో ఆరాధించే అభిమానులను తిడుతూ, వారిని బూతులు మాట్లాడుతూ అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు. ఇక ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పటికే చాలా సందర్భాలలో బాలకృష్ణ తన అభిమానులపై చేయి చేసుకున్నారు. ఇది చూసిన బాలకృష్ణ అంటే పడని కొంతమంది ఈ విషయంలో బాలయ్య బాబుని విమర్శిస్తారు. కానీ బాలకృష్ణ అభిమానులు ఆయన కొట్టినా కూడా ఆనందంగానే స్వీకరిస్తారు. మా అభిమాన హీరో మమ్మల్ని టచ్ చేశారని ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు.
అభిమాని విషయంలో గొప్ప మనసు చాటుకున్న బాలయ్య..
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా బాలకృష్ణ చేసిన ఈ పని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు శభాష్ అనాల్సిందే.ఎందుకంటే బాలకృష్ణ తన వీరాభిమానిని ఆదుకోవడమే కాదు ఓ కుటుంబాన్ని నిలబెట్టారు కూడా. విషయం ఏమిటంటే..బాలకృష్ణ వీరాభిమాని అయినటువంటి ఆదోనికి చెందిన బద్రి స్వామి (Badri Swamy) చాలా రోజుల నుండి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారట. ఇక ట్రీట్మెంట్ చేయడానికి రూ.20 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంత డబ్బు పెట్టి చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఈ విషయాన్ని బాలకృష్ణ దాకా చేరవేశారు ఆదోని (Adoni)లో ఉండే బాలకృష్ణ అభిమానుల సంఘం వాళ్లు.. ఇక అసలు విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించి, గవర్నమెంట్ నుండి బద్రి స్వామికి రూ.10 లక్షల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.
ఒక కుటుంబానికి అండగా బాలయ్య దంపతులు..
అంతేకాదు దానికి సంబంధించిన పత్రాన్ని స్వయంగా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి (Vasundhara Devi) బద్రి స్వామి కుటుంబానికి అందజేశారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు బాలకృష్ణ మంచి మనసుని చూసి మెచ్చుకుంటున్నారు. అభిమానులకు ఆపద వస్తే బాలయ్య బాబు అస్సలు వెనకడుగు వేయరు అంటూ మెచ్చుకుంటున్నారు.. నేను ఇంత పెద్ద స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా అభిమానులు అని స్టేజి మీద గొంతు పోయేలా హీరోలు అరవడం కాదు.. అభిమానులు ఆపదలో ఉంటే ఇలా సాయం చేసే గుణం కూడా ఉండాలి అంటూ బాలకృష్ణ చేసిన పనిని మెచ్చుకుంటూ మిగతా హీరోలు కూడా బాలకృష్ణని చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO RAED: Upendra: ఉపేంద్ర హీరో అవ్వడం వెనుక ఆమె హస్తం ఉందా.. ఈ జీవితం ఆమె పెట్టిన భిక్ష అంటూ!