Upendra..ఉపేంద్ర రావు (Upendra Rao) .. సినీ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన.. రచయితగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 1992లో ‘తర్లే నన్ మగ’ అనే సినిమా ద్వారా రచయితగా, వ్యాఖ్యాతగా, దర్శకుడిగా, గీతా రచయితగా మొదటి ప్రయత్నంలోనే మంచి ప్రతిభను కనబరిచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక 1995లో శివరాజ్ కుమార్ (Shivaraj kumar) హీరోగా ‘ఓం’ అనే చిత్రానికి రచయితగా పనిచేసి ఉత్తమ దర్శకుడు విభాగంలో కర్ణాటక ప్రభుత్వం చేత ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
ఆమె వల్లే ఈ జీవితం – ఉపేంద్ర
ఇకపోతే కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారే అయినా ఇటు తెలుగు, అటు తమిళ్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఒకరకంగా చెప్పాలి అంటే రియల్ స్టార్ అనిపించుకుంటున్న ఈయన.. తన చిత్రాలకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సినిమాల్లో గాడ్ ఫాదర్ గా పేరు దక్కించుకున్నారు. ఇకపోతే తాను ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఒక మహిళ అని, ఆమె లేకపోతే తాను ఈరోజు లేను అని కూడా చెప్పుకొచ్చారు ఉపేంద్ర. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ జీవితం ఆమె పెట్టిన భిక్ష – ఉపేంద్ర
అసలు విషయంలోకి వెళ్తే.. శుక్రవారం బెంగళూరులో జరిగిన దివంగత హీరోయిన్ సరోజా దేవి (Saroja Devi) సంతాప సభలో ఉపేంద్ర పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. “సరోజా దేవి నాడు లేకపోతే నేడు ఉపేంద్ర అనేవాడు ఉండేవాడు కాదు. నేను దర్శకత్వం వహించిన ఏ (A Movie) సినిమా విడుదలకు సెన్సార్ సమస్య వచ్చింది. అప్పుడు నటి సరోజా దేవి నాకు మద్దతుగా నిలిచారు. సెన్సార్ నిరాకరించడంతో మేము రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు సరోజా దేవి నన్ను లోపలికి పిలిచి, నేను తీసిన ఏ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె మా సినిమాను ఇష్టపడి సెన్సార్ చేసేలా చేశారు. అప్పటినుంచి ఆమెను కలిసినప్పుడల్లా మీరు లేకపోతే నేను హీరో అయ్యేవాడిని కాదు అని ఎన్నోసార్లు చెప్పాను. నా కెరియర్ కు పునాది వేసి.. మద్దతు ఇచ్చిన దేవతామూర్తి.. ఒకరకంగా చెప్పాలి అంటే నేడు నాకు లభించిన ఈ జీవితం ఆమె పెట్టిన భిక్ష ” అంటూ కామెంట్లు చేశారు ఉపేంద్ర. ఇక ప్రస్తుతం ఉపేంద్ర చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఎవరీ సరోజా దేవి?
సరోజా దేవి విషయానికి వస్తే.. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈమె.. 1955లో వచ్చిన ‘మహాకవి కాళిదాస’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాదు కన్నడ నాట తొలి లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె.. ఇటీవల వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడిచారు. ఈమె మరణాంతరం సంతాప సభ నిర్వహించగా.. ఆ సభలో ఉపేంద్ర ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె వల్లే ఈ జీవితం అంటూ చెప్పుకొచ్చారు.
ALSO READ:Bollywood Actress: ప్రముఖ నిర్మాతని చెప్పుతో కొట్టిన నటి.. వీడియో వైరల్.!