Milk For Hair Growth: పాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. జుట్టు సంరక్షణకు కూడా అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. పాలలో ఉండే ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు A, B, బయోటిన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు జుట్టును బలోపేతం చేసి.. ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. ముఖ్యంగా.. పాలలో ఉండే కేసిన్ అనే ప్రొటీన్ జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఇవి జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి పాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
జుట్టు పెరుగుదలకు పాలను ఎలా ఉపయోగించాలి ?
పాలను జుట్టుకు ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని సులభమైన పద్ధతులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి పాలతో మసాజ్:
విధానం: కొద్దిగా పచ్చి పాలను (వేడి చేయనివి) తీసుకుని.. తలపై చర్మం (స్కాల్ప్) జుట్టు కుదుళ్లకు బాగా పట్టించండి. తర్వాత వేళ్ళతో సున్నితంగా 10-15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, షాంపూతో గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇలా వారానికి 1-2 సార్లు కూడా చేయవచ్చు.
ప్రయోజనం: ఇది తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. చుండ్రు, పొడి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
2. పాలు, తేనెతో హెయిర్ మాస్క్:
కావలసినవి:
1/2 కప్పు పాలు
2 టేబుల్ స్పూన్ల తేనె.
తయారీ విధానం: పాలు, తేనె బాగా కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు స్కాల్ప్‌కు అప్లై చేయండి.20-30 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనం: తేనె సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది, జుట్టుకు తేమను అందిస్తుంది. పాలు, తేనె కలయిక జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా అవసరం అయిన పోషణను కూడా అందిస్తుంది. దీనిని తరచుగా వాడటం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
3. పాలు, ఎగ్ హెయిర్ మాస్క్:
కావలసినవి:
1/2 కప్పు పాలు,
1 గుడ్డు .
తయారీ విధానం: గుడ్డును బాగా గిలకొట్టి.. పాలలో కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు, స్కాల్ప్‌కు పట్టించండి. తర్వాత 30 నిమిషాల పాటు ఉంచి, షాంపూతో చల్లటి నీటితో తలస్నానం చేయండి.
ప్రయోజనం: గుడ్డులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్నిస్తాయి. పాలు, గుడ్డు కలయిక బలహీనపడిన కుదుళ్లను తిరిగి శక్తివంతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరం అయిన పోషణను కూడా అందిస్తుంది.
Also Read: ఈ హెయిర్ మాస్క్ వాడితే.. సిల్కీ జుట్టు మీ సొంతం
4. పాలు, కలబంద మిశ్రమం:
కావలసినవి:
1/2 కప్పు పాలు
2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు.
తయారీ విధానం: పాలు, కలబంద గుజ్జును బాగా కలిపి జుట్టు, స్కాల్ప్‌కు అప్లై చేయండి. 30 నిమిషాల పాటు ఉంచి తలస్నానం చేయండి.
ప్రయోజనం: కలబంద చుండ్రును తగ్గిస్తుంది. పాలు జుట్టుకు పోషణ అందిస్తాయి. ఈ మిశ్రమం జుట్టుకు తేమను అందించి.. పొడిబారడాన్ని నివారిస్తుంది.