BigTV English

OTT Ban: అశ్లీల ఓటీటీల బ్యాన్‌పై స్పందించిన ఏక్తా కపూర్.. భలే తప్పించుకుందే!

OTT Ban: అశ్లీల ఓటీటీల బ్యాన్‌పై స్పందించిన ఏక్తా కపూర్.. భలే తప్పించుకుందే!

OTT Ban: ఇటీవల ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు సెన్సార్ ఉన్న నేపథ్యంలో అశ్లీల సన్నివేశాలను తొలగిస్తూ సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే ఓటీటీలకు సెన్సార్ లేని నేపథ్యంలో అశ్లీల సన్నివేశాలతో కూడిన సినిమాలు వెబ్ సిరీస్ లో కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి దృశ్యాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీలు, స్ట్రీమింగ్ వేదికలపై నిషేధం విధించింది. అందులో ఉల్లు, ఏఎల్‌టీటీ సహా కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు ఉన్నాయి.


ఓటీటీ బ్యాన్.. స్పందించిన ఏక్తా కపూర్..

ఈ విధమైనటువంటి అశ్లీల దృశ్యాలకు సంబంధించిన కంటెంట్ ప్రసారం చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల తాజాగా బాలీవుడ్ నటి, నిర్మాత ఏక్తా కపూర్(Ekta Kapoor) స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రభుత్వం విధించిన వాటిలో ఏఎల్‌టీటీ (ALTT)ఉన్న నేపథ్యంలో ఈమె స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏఎల్‌టీటీకి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. తాను 2021 జూన్ నుంచి ఏఎల్‌టీటీతో సంబంధాలను కొనసాగించలేదని తెలిపారు.


మాకు ఎలాంటి సంబంధం లేదు..

తనతోపాటు తన తల్లి శోభ కపూర్(Sobha Kapoor)కూడా ఏఎల్‌టీటీకి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలలో పాల్గొనడం లేదని తెలిపారు.గతంలో ALTBalaji అని పిలువబడే ALTT, జాబితాలో అత్యంత హై ప్రొఫైల్ పేర్లలో నిర్మాత ఏక్తా కపూర్ పేరు కూడా వినిపించేది అయితే ప్రభుత్వం నిషేధం విధించిన వెంటనే ఈమె ALTT తో మాకు సంబంధం లేదని ఈ ప్లాట్ ఫామ్ ద్వారా వచ్చే అభ్యంతరకర సన్నివేశాలకు నాకు, నా తల్లికి ఏ విధమైనటువంటి సంబంధం లేదని ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ALTT విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

నిషేధించిన యాప్స్ ఇవే..

ఇక ఓటీటీలలో ప్రసారమవుతున్న సినిమాలు వెబ్ సిరీస్ లలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అశ్లీల దృశ్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొన్ని రొమాంటిక్ సినిమాలు సెన్సార్ కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి అడ్డుకట్టు వేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దాదాపు అందరూ స్వాగతిస్తున్నారనే చెప్పాలి. ఇక కేంద్రం నిషేధం విధించిన యాప్స్, వెబ్సైట్స్ విషయానికి వస్తే..ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్‌, బిగ్‌ షాట్స్‌, బూమెక్స్‌, నవరస లైట్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌,వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫినియో, షోఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ వీఐపీ,బుల్‌ యాప్‌, జల్వా యాప్‌, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియాన్‌ఎక్స్‌ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్‌, ట్రైఫ్లిక్స్‌ వంటి వాటిపై నిషేధం విధించారు.

Also Read: Athadu Re-release: అతడు రీ రిలీజ్.. కలెక్షన్లు మొత్తం వారికే.. గొప్ప నిర్ణయం అంటూ!

Related News

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Cine Workers Strike : ఆమరణ దీక్షకు రెడీ… సినీ కార్మికులను ఎవరూ ఆపలేరా ?

Weapons Movie : హెవీ హాంటెడ్ సీన్స్… థియేటర్లలో జనాలను పరుగులు పెట్టిస్తున్న ఇంగ్లీష్ మూవీ

Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు

Big Stories

×