Virat Kohli : టీమిండియా కీలక క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సచిన్ టెండూల్కర్ తరువాత అంత మంచి నమ్మకమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. అతన్ని రన్ మిషన్.. కింగ్ కోహ్లీ అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ విరాట్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 ఐసీసీ వరల్డ్ కప్ అనుభవాలను ప్రస్తావించాడు.
Also Read : Lionel Messi : మెస్సీతో క్రికెట్ ఆడనున్న భారత దిగ్గజ క్రికెటర్లు..!
ఆ మ్యాచ్ ఓటమితో అంతా షాక్..
అయితే మాంచెస్టర్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో ఓడిపోవడాన్ని అత్యంత బాధాకరమైన సందర్భం అని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తరువాత ఇండియన్ క్యాంప్, డ్రెస్సింగ్ రూమ్ లో విషాదకరమైన వాతావరణం నెలకొందని.. ప్లేయర్లతో పాటు హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ లు ఇతర సపోర్టింగ్ స్టాప్ అంతా విషాదంలో కనిపంచారని యజ్వేంద్ర చాహల్ చెప్పాడు. గెలుస్తుందనుకున్న మ్యాచ్ ఓడిపోవడం షాక్ కి గురి చేసిందని పేర్కొన్నాడు.ఓటమి తరువాత విరాట్ కోహ్లీ బాత్ రూమ్ ఏడ్చాడని చాహల్ చెప్పాడు. ఒక్క కోహ్లీ మాత్రమే కాకుండా రోహిత్ శర్మ, ఇతర ప్లేయర్లు అందరూ కన్నీరు పెట్టుకున్నారని అన్నాడు. విరాట్ తో పాటు చాలా మంది భారత ఆటగాళ్లు బాత్ రూమ్ ల్లో ఏడ్చిన సంఘటన తనకు బాగా గుర్తుందని చెప్పాడు.
భారత్ ఓటమి.. విరాట్ ఆవేదన
మాంచెస్టర్ లో జరిగిన ఆ మ్యాచ్ లో.. రిజర్వ్ డే రోజున భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 240 పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. ఈ ఓటమి జట్టు సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ కి న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్.. దాన్ని అందుకోలేకపోయింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. మహేంద్ర సింగ్ ధోనీ 50 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మార్టిన్ గప్టిల్ అద్భుతమైన త్రోకు అతను పెవిలియన్ దారి పట్టాడు. రవీంద్ర జడేజా 77 పరుగులు చేసి పోరాడాడు. మిగతా బ్యాటర్లందరూ ఆ మ్యాచ్ లో త్వరగా ఔట్ అయ్యారు. ఇక ఆ మ్యాచ్ ఆడిన జట్టులో చాహల్ కూడా సభ్యుడు. 2019 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఓటమి విరాట్ కోహ్లీని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బాత్ రూమ్ లో అతను ఏడవడం చూశానని.. చివరి బ్యాటర్ గా నేను క్రాస్ చేస్తున్నప్పుడు అతని కళ్లలో నీళ్లు కనిపించాయి. ఆ సమయంలో అందరూ బాత్ రూమ్ లో ఏడ్చారు అని చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు.