E-Paper
Advertisement

సంజీవ్ గోయెంకాకు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడు!

సంజీవ్ గోయెంకాకు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడు!
Advertisement

Faf Du Plessis On RPSG Sanjeev Goenka Vs MS Dhoni: ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాపై దక్షిణాఫ్రికా మాజీ సారధి ఫాఫ్ డుప్లెసిస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సంజీవ్ గోయెంకాకు అసలు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడని కామెంట్ చేసినట్టు సోషల్ మీడియా ఓ న్యూస్ వైరల్ గా మారింది. 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభానికి కంటే ముందే ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా నిర్ణయం తీసుకున్నాడు. ఈ తరుణంలోనే ధోని స్థానంలో స్టీవెన్ స్మిత్ కు అవకాశం ఇచ్చాడు. అయితే, మిస్టర్ కూల్ గా పేరున్న ధోనిని తప్పించిన సంఘటనపై గతంలో అదే జట్టులో ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. కెప్టెన్సీ పదవి నుంచి ధోనిని తప్పించిన తరుణంలో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ జట్టు ప్లేయర్లు డీలా పడిపోయారన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే తమ డ్రెస్సింగ్ రూంలో భూకంపమే వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గొప్ప వ్యక్తిని తప్పించాడని అందరూ బాధపడ్డారన్నారు. కానీ ధోని మాత్రం హుందాగా వ్యవహరించి, జట్టు కోసం పని చేశాడని కొనియాడాడు. అందుకే ధోని గొప్ప నాయకుడు అయ్యాడని తెలిపాడు.

ధోని లాగానే స్టీవ్ స్మిత్ తోపు కెప్టెనే

ధోని స్థానంలో వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ జట్టును బాగానే లీడ్ చేశాడని దక్షిణాఫ్రికా మాజీ సారధి ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. ధోని జట్టులో ఉన్నప్పటికీ, తనదైన స్టైల్‌లో నిర్ణయాలు తీసుకుంటూ అదే సీజన్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడని చెప్పాడు. కానీ ఫైనల్స్ లో ఒకే ఒక పరుగు తేడాతో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ చెప్పినట్టుగానే 2017 ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్, వర్సెస్ రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ మధ్య ఫైనల్స్ జరిగింది. ఇందులో ఒకే ఒక పరుగు తేడాతో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ఓటమి పాలైంది.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ లోకి ధోని ఎందుకు వెళ్లాడంటే ?

రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ జట్టులోకి ధోని వెళ్లడం వెనుక పెద్ద తతంగమే ఉంది. 2013 లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, ఆన్ లైన్ బెట్టింగ్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించారు. 2016, 2017 సీజన్లలో చెన్నైపై నిషేధం కొనసాగింది. దీంతో ఆ రెండు సీజన్ల పాటు రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ తరఫున బరిలోని ధోని దిగాడు. కానీ 2018 లో మళ్లీ చెన్నైకి కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ధోని, జట్టును చాంపియన్ గా నిలిపి, విమర్శకుల నోర్లు మూయించాడు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

Related News

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్

న్యూజిలాండ్, టీమిండియా సిరీస్ పై ICC వెంట‌నే విచార‌ణ చేయాలి!

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?

అభిషేక్‌-వైభ‌వ్ కంటే బాబ‌ర్‌-రిజ్వానే రియ‌ల్ హీరోలు

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?

అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది

Big Stories

Advertisement
×