E-Paper
Advertisement

రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Advertisement

Train Charging: మనం సాధారణంగా రైలు ప్రయాణంలో నైట్ టైమ్ ఫోన్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటూ ఉంటాం. కానీ దీని వల్ల ఊహించని పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందని రైల్వే డిపార్ట్‌మెంట్ అలర్ట్ అయింది. రీసెంట్‌గా ముంబయి లోకల్ ట్రైన్‌లో ఛార్జింగ్ పెట్టిన ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోయింది. దాంతో కోచ్ అంతా దట్టమైన పొగ నిండిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన తర్వాత రైల్వే బోర్డ్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయింది.

షార్ట్ సర్క్యూట్..

రాత్రిపూట ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఛార్జింగ్ సాకెట్లలో ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ జరిగితే వెంటనే గుర్తించడం ఇంపాజిబుల్. అది పెద్ద అగ్నిప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా రాత్రి 11 నుంచి 6 గంటల పాటు ఛార్జింగ్ పాయింట్లు స్విచ్ఛాఫ్ చేసేలా సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని జోన్లకు డైరెక్షన్స్ వెళ్లాయి. ఆఫీసర్లు డైరెక్ట్‌గా వచ్చి సర్ప్రైజ్ రైడ్స్ చేస్తారని, సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.

2014లోనే..

Advertisement

యాక్చువల్‌గా రైళ్లలో రాత్రి పూట ఛార్జింగ్‌పై రెస్ట్రిక్షన్స్ 2014లోనే తీసుకొచ్చారు. కానీ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేకపోవడంతో చాలామంది ఇప్పటికీ వాడుతున్నారు. తాజా పవర్ బ్యాంక్ బ్లాస్ట్ ఇన్సిడెంట్‌తో ఈ రూల్స్‌ను ఇకపై చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేయబోతున్నారు. కాబట్టి ప్రయాణికులు కూడా సహకరించి నైట్ టైమ్ ఛార్జింగ్ పెట్టకపోవడమే సేఫ్.

Also Read: ఎల్‌నినో ముప్పుపై ప్రభుత్వం అలర్ట్.. మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు!

Tags

Related News

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు.. 46 మంది మృత్యువాత!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మెట్రోకు కొత్త లింక్ ప్లాన్!

40 రోజులు స్నానం చేయకుండా మహిళల వేషాలు వేసే పురుషులు.. ఈ వేడుక ఎక్కడ జరుగుతుందంటే?

రజనీకాంత్ ‘జైలర్ 2‘ షూటింగ్ లొకేషన్స్ ఇవే.. ట్రావెల్ లవర్స్‌ కు వెరీ స్పెషల్!

యూరప్ రైళ్ల కంటే వందే భారత్ బెటర్.. పోలాండ్ యువతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత పైలట్ ధైర్యానికి యూఏఈ ఫిదా.. అత్యున్నత పురస్కారంతో సత్కారం!

Big Stories

Advertisement
×