Telugu Sequel Movies : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంభోలో,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘రాజా సాబ్ ‘.. గత ఏడాదిలో వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో రాబోతున్న రాజా సాబ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు.. ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.. ఈ మూవీ రిలీజ్ డేటు గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే వస్తుంది.. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది..
‘రాజా సాబ్ పార్ట్ 2’ ఉందా..?
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే విడుదల ఆలస్యం అవుతుందని టీమ్ వెల్లడించారు.. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నిర్మాత విశ్వప్రసాద్ రాజాసాబ్ రన్ టైమ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వ ప్రసాద్’ రాజాసాబ్ షూట్ అక్టోబర్ కు ఫినిష్ అవుతుంది. మొత్తం ఈ సినిమా నాలుగున్నర గంటల ఫ్యూటేజ్ వస్తుంది. దాన్ని పూర్తిగా ఎడిట్ చెయ్యడం వల్ల మూడు గంటలు లేదా 2.45 నిమిషాల వరకు ఉంటుందని అన్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకునే సాంగ్స్, కామెడీ, మాస్, స్టోరీ, విజువల్ గ్రాండియర్ అన్ని ఉంటాయి. ప్రభాస్ నుండి బెస్ట్ హారర్ కామెడీ సినిమాగా రాబోతుంది అని అన్నారు.. అంతేకాదు ఈ మూవీకి సీక్వెల్ గా రాజా సాబ్ 2 రాబోతుందని ఓ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Also Read: తెరపైకి ఏజెంట్ టినా వెబ్ సిరీస్… లోకీ మావా డీటైల్స్ చూస్తే మైండ్ పోతుంది…
పార్ట్ 2 పై ఫ్యాన్స్ టెన్షన్..
ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలకు కొదవ లేదు.. స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు ఒకటి హిట్ అయితే దాన్ని సీక్వెల్ గా మరోకటి వస్తుంది. అయితే 2 పార్ట్స్ గా వచ్చే సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. ప్రభాస్ బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు మాత్రమే రెండు పార్ట్స్ వర్క్ అవుట్ అయ్యాయి. ఆ తర్వాత రెండు పార్ట్స్ గా వచ్చిన సినిమాలన్నీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాంటి టైంలో 2 పార్ట్స్ అని ట్విస్ట్ ఇచ్చారు ప్రొడ్యూసర్. దీంతో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో 2 పార్ట్స్ గా వస్తున్న సినిమాల రిజల్ట్ ను గుర్తు తెచ్చుకుని ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్విస్ట్ ఏంటి మన దరిద్రం కాకపోతే అని టెన్షన్ పడుతున్నారు.
రీసెంట్ సీక్వెల్స్ రిజల్ట్..?
ఒకప్పుడు స్టార్ హీరోల హిట్ సినిమాలకు కొనసాగింపు ఉంటే బాగుంటుందని అభిమానులు అభిప్రాయ పడుతుండేవారు. కానీ ఈ మధ్య వస్తున్న రిజల్ట్ ను బట్టి ఒక్క సినిమా అయితే బెటర్ అని భావిస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్ డమ్ లు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి అంటే అభిమానులు పెదవిరుస్తున్నారు. అలాంటి పరిస్థితి ప్రభాస్ సినిమాలకు వస్తుందేమో అని టెన్షన్ పడుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్..దీనిపై ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..ఇప్పటికే ప్రభాస్ చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తి అయ్యాకే ఈ సినిమా చేసే అవకాశం ఉంది..