E-Paper
Advertisement

మోక్షజ్ఞ సినిమాలపై ఒత్తిడి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బాలయ్య చిన్నల్లుడు!

మోక్షజ్ఞ సినిమాలపై ఒత్తిడి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బాలయ్య చిన్నల్లుడు!
Advertisement

Mokshagna -Bharat: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఎంతోమంది నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే నందమూరి అభిమానులు మాత్రం నటసింహం బాలకృష్ణ (Balakrishna)వారసుడు మోక్షజ్ఞ(Mokshagna) సినిమా ఎంట్రీ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నప్పటికీ అభిమానుల ఆశలు మాత్రం నెరవేరలేదు. గతంలో ఈయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించారు కానీ ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల క్యాన్సిల్ అయింది.

వశిష్ట డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ…

ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ తదుపరి సినిమా ఎవరి డైరెక్షన్లో ఉండబోతోంది అంటూ ఎన్నో రకాల సందేహాలు వచ్చాయి. అయితే ఇటీవల మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేశారు. బింబిసారా దర్శకుడు వశిష్ట(Vassishta) దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉండబోతుందని అధికారకంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అతి త్వరలోనే సెట్స్ మీదకు ఈ సినిమాకి వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాల గురించి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్(Bharat) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ కొడుకుగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు..

Advertisement

బాలకృష్ణ చిన్న అల్లుడు ఎంపీ భరత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా మోక్షజ్ఞ సినిమాల గురించి మాట్లాడుతూ..మోక్షజ్ఞను చూస్తే కొంచెం జాలి కలుగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ మనవడిగా, బాలకృష్ణ కొడుకుగా సినిమాల పరంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లకు ఫెయిల్యూర్ అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ మోక్షజ్ఞ విషయంలో అలా కాదని తెలిపారు. తన తాత ఎన్టీఆర్ గారు అలాగే తన తండ్రి బాలకృష్ణ కావడంతో ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాలని ఆయన ఏ సినిమా చేసిన విమర్శలు వస్తాయని తెలిపారు.

తాత తండ్రి సినిమాలు చేశారని ఇండస్ట్రీ లోకి రాకూడదు…

మోక్షజ్ఞ సినిమాల పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో తనకి ఎప్పుడూ ఒక సలహా ఇస్తూ ఉంటాను. తన తాత, తండ్రి సినిమాలు చేశారని మాత్రమే తను కూడా ఇండస్ట్రీ లోకి రావాలని అనుకోకూడదు అంటూ తాను సలహా ఇస్తానని భరత్ తెలిపారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వారికి సినిమా అవకాశం అందుకోవడం చాలా కష్టం అయినప్పటికీ మొదటి సినిమా బాగుంటే తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి కానీ మోక్షజ్ఞ విషయంలో అలా కాదు.. ఆయన ఎలాంటి సినిమాలు చేసిన ప్రేక్షకులు జడ్జ్ చేస్తారంటూ భరత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.త్వరలోనే మోక్షజ్ఞ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు.

Advertisement

Also Read: అనుపమకు ఆ సినిమా అంటే అంత పిచ్చా..50 సార్లు చూసానంటూ!

Related News

అనుపమకు ఆ సినిమా అంటే అంత పిచ్చా..50 సార్లు చూసానంటూ!

నానిని బావ అని ఎందుకు పిలుస్తానో తెలుసా? స్నిగ్ధ చెప్పిన అసలు విషయం ఇదే!

నితిన్ భార్యగా చేస్తున్న రుక్మిణి ఎవరో తెలుసా?

నాని ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షూర్..ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే!

అందరినీ నవ్వించిన కమెడియన్‌కు ఇంత కష్టమా? రామచంద్ర పరిస్థితి చూస్తే కన్నీళ్లే!

నవరాత్రి స్పెషల్.. ‘భరత వర్ష’ నుండి “అమ్మ కదిలి వచ్చే” సాంగ్ ప్రోమో రిలీజ్!

నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×