E-Paper
Advertisement

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?
Advertisement

Jabardasth Babu:జబర్దస్త్‌లో తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న బాబు ఇప్పుడు దర్శకుడిగా లీస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ అనే సిరీస్ ని తెరకెక్కించిన సంగతి తెల్సిందే.ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పుకొచ్చాడు బాబు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్‌తో తనకున్న అనుబంధం గురించి, ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఆయనకు హీరోగా ఎందుకు ఎదగలేదో తన మాటల్లో ఇలా తెలిపాడు బాబు.

సోషల్ మీడియాలో సుధీర్‌కు ఉన్న క్రేజ్

Advertisement

సుడిగాలి సుధీర్‌ గురించి బాబు మాట్లాడుతూ సోషల్ మీడియాలో సుధీర్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదని, అయితే ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ,అలాగే మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్ దక్కడం లేదని అభిప్రాయపడ్డారు. ఒక సినిమా కథను ఎంచుకునే సమయంలో చాలా మందితో చర్చించడం సహజమని, కానీ చివరికి ప్రేక్షకులకు ఆ కథ ఎలా నచ్చుతుంది, సినిమా విడుదలయ్యాక ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ముందే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదని వివరించారు. షూటింగ్ సమయంలో దర్శకుడి దగ్గర నుంచి కెమెరామన్, ప్రొడక్షన్ సిబ్బంది వరకు అందరికీ సినిమా బాగా వచ్చిందనే అభిప్రాయం ఉండొచ్చని, కానీ ప్రేక్షకుల స్పందన మాత్రం భిన్నంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

సుధీర్‌ లో యాక్టింగ్,కామెడీ డ్యాన్స్ ఇలా అన్ని టాలెంట్స్ ఉన్నాయని అలాంటి వ్యక్తికి మంచి కథ కుదిరితే తప్పకుండా పెద్ద విజయం సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, తాను మొదటగా ఒక కథను సుధీర్‌కే చెప్పానని కథ విన్న తర్వాత సుధీర్ తనని ఎంతో ఎంకరేజ్ చేశారని కథ ఎలా ఉండాలి, ఎక్కడ మొదలవ్వాలి, ఎక్కడ ముగియాలి, ఎలాంటి ట్విస్ట్ లు ఉండాలి అనే విషయాలపై తనకు మంచి నాలెడ్జ్ ఉందని వేరే వాళ్ళతో చెప్పినట్టు బాబు గుర్తు చేసుకున్నారు. అయితే ఆ కథతో సినిమా ముందుకు వెళ్లనప్పటికీ సుధీర్‌తో కలిసి భవిష్యత్తులో సినిమా చేయాలనే ఆలోచన తనకు ఉందని, సరైన కథ కుదిరినప్పుడు తప్పకుండా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

నాగబాబు, రోజా గురించి  మాట్లాడుతూ

ఇక జబర్దస్త్‌లో తనకు పరిచయమైన నాగబాబు, రోజా గురించి  బాబు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకు ఎంతో ఎంకరేజ్ మెంట్ ఇచ్చేవారని తెలిపారు. మొదట్లో వారి దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటే భయపడేవాళ్లమని, తమ పేరు స్టేజ్‌పై ప్రస్తావించిన తర్వాత కొంత ధైర్యం వచ్చేదని చెప్పారు. రోజా తనకు వ్యక్తిగతంగా కూడా ఎంతో సహాయం చేశారని బాబు తెలిపారు. తనకు అవసరమైన కొన్ని పనుల విషయంలో ఎమ్మెల్యేతో మాట్లాడటంతో పాటు, మహిళల కౌన్సెలింగ్‌కు సంబంధించిన విషయాల్లోనూ ఆమె స్పందించారని చెప్పారు.

ఇక జబర్దస్త్‌లో పనిచేసిన అనుభవం తన జీవితానికి ఎంతో ఉపయోగపడిందని బాబు తెలిపారు. అక్కడి ఆర్టిస్టులు, టీమ్ సభ్యులతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని, దర్శకుడిగా మారిన తర్వాత కూడా వాళ్లు తనకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. తన సినిమా ప్రమోషన్ల కోసం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ బృందాల హెల్ప్ కావాలని కోరినప్పుడు మంచిగా స్పందించారని వెల్లడించారు. ఫైమా, పంచ్ ప్రసాద్, నూకరాజు, రామప్రసాద్, నరేష్ వంటి వాళ్లు తనకు అవసరమైనప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

తాగుబోతు రమేష్‌తో కథల గురించి

దర్శకుడిగా మారడం వెనుక ఉన్న కష్టాలను వివరిస్తూ రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా పనిచేయడం ద్వారా తనకు ఫైనాన్షియల్ గా సెటిల్ అయినప్పటికీ సినిమాలపై తనకున్న ఆసక్తిని వదులుకోవాలని అనుకోవడం లేదన్నారు. ప్రస్తుతం కొత్త సినిమాల కోసం కథలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని కథలను పూర్తిస్థాయిలో రాసుకున్నానని, వాటిలో హారర్ కథ కూడా ఉందని వెల్లడించారు. తాగుబోతు రమేష్‌తో కథల గురించి చర్చిస్తుంటానని, ఆయన ఇచ్చే సూచనలు కూడా తనకు ఉపయోగపడతాయని చెప్పారు. సరైన నిర్మాత, మంచి నిర్మాణ సంస్థ దొరికితే మరింత పెద్ద స్థాయిలో సినిమా చేయాలని భావిస్తున్నట్లు వివరించారు.

మొత్తంగా చూస్తే, జబర్దస్త్‌లో స్కిట్లు రాస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన బాబు ఇప్పుడు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.చూడాలి మరి లీస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ తో నవ్వులు పూయిస్తున్న బాబు త్వరలో సుదీర్ తో ఎప్పుడు సినిమా చేస్తాడో !

ALSO READ :నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

Tags

Related News

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

భయమేస్తోంది అంటున్న విజయ్.. రష్మిక.. బయటకు కనిపించవు సుమీ!

హమ్మయ్య.. పెళ్లెప్పుడో చెప్పేసిన ప్రదీప్..ఇక పీ పీ.. డుం డుం..

మంగ్లీ బతుకమ్మ పాట రెమ్యూనరేషన్ ఎంత? ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం

ఆ హీరోయిన్ కు ఫిదా అయ్యానంటున్న జగపతి బాబు..తన క్రష్ బయట పెట్టాడుగా?

జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?

ప్రియుడు బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!

Big Stories

Advertisement
×