E-Paper
Advertisement

అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్

అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్
Advertisement

Korean Superhero Action Comedy OTT : అవయవ మార్పిడి చేయించుకుంటే ప్రాణం నిలబడుతుంది. కానీ అదే ఆపరేషన్ తర్వాత శరీరంలోకి వచ్చిన అవయవం ఊహించని సూపర్ పవర్‌ ను కూడా అందిస్తే ? ఒకరు అపారమైన బలం పొందితే, మరొకరు విద్యుదయస్కాంత తరంగాలను నియంత్రించగలిగితే, ఇంకొకరు గాలిని శక్తివంతంగా కదిలించగలిగితే ? ఇలా ఐదుగురు సాధారణ వ్యక్తుల జీవితాల్లో జరిగే అసాధారణ మార్పుల చుట్టూ సాగే కొరియన్ సూపర్‌హీరో యాక్షన్ కామెడీ ‘హై-ఫైవ్’ (Hi-Five). మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? అంటే…

కథలోకి వెళ్తే…

అవయవ మార్పిడి కోసం దాత నుంచి గుండె, కార్నియా, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు పొందిన ఐదుగురు వ్యక్తుల జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ అవయవాలను పొందిన తర్వాత వాళ్లలో సాధారణంగా మనుషులకు ఉండని శక్తులు కనిపిస్తాయి. ఓ యువతికి అసాధారణమైన శారీరక బలం వస్తుంది. మరో వ్యక్తి విద్యుదయస్కాంత తరంగాలను కంట్రోల్ చేయగలుగుతాడు. ఓ రచయిత గాలి తుఫాను లాంటి శక్తిని సృష్టించగలడు. ఫ్యాక్టరీ మేనేజర్ ఇతరులను నయం చేసే సామర్థ్యాన్ని పొందుతాడు. ఐదో వ్యక్తికి వచ్చిన శక్తి మాత్రం మొదట్లో స్పష్టంగా అర్థం కాదు.

Advertisement

తమలో వచ్చిన ఈ మార్పులకు కారణమేంటో తెలుసుకోవడంతో పాటు, ఆ శక్తులను ఎలా నియంత్రించాలో కూడా వాళ్లు నేర్చుకోవాల్సి వస్తుంది. మొదట్లో తమకు వచ్చిన సామర్థ్యాలు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు సృష్టించినా, తర్వాత వాటిని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయవచ్చని గ్రహిస్తారు. దీంతో ఐదుగురూ కలిసి హై-ఫైవ్ అనే బృందంగా ఏర్పడతారు. అయితే వాళ్లకు మాత్రమే సూపర్ పవర్స్ రాలేదనే విషయం తర్వాత తెలుస్తుంది.

అదే దాత నుంచి ప్యాంక్రియాస్ పొందిన ఓ మతపరమైన నాయకుడికి ఇతర జీవుల నుంచి జీవశక్తిని పీల్చుకునే సామర్థ్యం వస్తుంది. అతడు హై-ఫైవ్ సభ్యుల శక్తులను కూడా తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. మరింత శక్తివంతుడిగా మారాలనే అతడి ప్రయత్నం ఐదుగురికీ ప్రమాదంగా మారుతుంది. తమ కొత్త శక్తులను పూర్తిగా అర్థం చేసుకోకముందే ఓ శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐదుగురు కలిసి తమ శక్తులను సమన్వయం చేసుకోగలరా ? ఇతరుల నుంచి జీవశక్తిని పీల్చుకునే వ్యక్తిని అడ్డుకోగలరా ? వాళ్లలో ఎవరి శక్తి ఏ సందర్భంలో ఉపయోగపడుతుంది ? యాక్షన్‌తో పాటు హాస్యాన్ని కలిపే ఈ కథను తెరపై చూడాల్సిందే.

Advertisement

Also Read : గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

తెలుగులో ఉందా ?

కాంగ్ హ్యోంగ్-చుల్ (Kang Hyoung-chul) దర్శకత్వం వహించిన హై-ఫైవ్ (Hi-Five) 2025లో విడుదలైన కొరియన్ చిత్రం. లీ జే-ఇన్ (Lee Jae-in), అన్ జే-హాంగ్ (Ahn Jae-hong), రా మి-రాన్ (Ra Mi-ran), కిమ్ హీ-వోన్ (Kim Hee-won), యూ ఆ-ఇన్ (Yoo Ah-in) తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో ఇంటర్నేషనల్ గా అందుబాటులో ఉంది.

Related News

చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

అమాయకపు కుర్రాడు అనుకున్నారు… కట్ చేస్తే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ మాంత్రికుడు… ఓటీటీలోకి సీజన్ 2

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ హర్రర్ యానిమే సిరీసులు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

సంగీతంతో ఒక్కటయ్యే బంధాలు… మనసును తాకే భావోద్వేగాలతో తెలుగు ఫ్యామిలీ డ్రామా

బందిపోటుగా మారే స్వాతంత్ర్య సమరయోధుడు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ బయోపిక్

Big Stories

Advertisement
×