HBD Balayya : కత్తి పడతారు.. కంఠం పగిలేలా డైలాగులు.. తొడ కొడతారు… వెండితెరపై శత్రువుల్ని తొక్కి పడేస్తారు. ఒక్క ఓ డైలాగ్ చెప్పినా ప్రత్యేకమే… ఏ స్టెప్పులేసినా ప్రత్యేకమే…ఒకసారి డిసైడై బరిలోకి దిగితే గెలుపు ఆయన సొంతం అవ్వాల్సిందే.. బాలయ్య చెప్పే డైలాగులు యావత్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాయి.. నరాలు తెగేలా పవర్ ఫుల్ డైలాగ్ లతో బాలయ్య అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. దర్శకుడు పై నమ్మకంతో రంగంలోకి దిగితే వెనక్కి చూడడు. సినిమా సెట్‌లో ఎన్ని సవాళ్లెదురైనా సరే.. బ్రేకుల్లేని బుల్డోజర్‌లాగే పాత్రలపై విరుచుకుపడతారు. రాయలసీమ మాస్ డైలాగులు చెప్పాలంటే అది ఒక్క బాలయ్యకే సాధ్యం. ఈ విషయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ముక్త కంఠంతో పలుకుతుంది. మాస్ ఆడియన్స్ ని అలరించేలా ఆయన చెప్పే ప్రతి డైలాగు థియేటర్లలో సౌండ్ స్పీకర్లు బద్దలయ్యేలా ఉంటాయి.. అలాంటి బాలయ్య పుట్టినరోజు నేడు.. ఆయన పుట్టినరోజు సందర్బంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు లు పెడుతున్నారు.. ఈ సందర్బంగా ఆయన సినిమాలు, రాజకీయ ప్రవేశం గురించి ఒకసారి తెలుసుకుందాం..
నందమూరి నటసింహం బాలయ్య పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు బాలయ్య. ఇక ఈయన హీరో అవ్వక ముందు నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు తండ్రి ఎన్టిఆర్ దర్శకత్వం వహించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది.. ఆదిత్య 369లో బాలకృష్ణ పాత్రను, కథను చాలామంది మెచ్చుకున్నారు.. జానపద కథలు, పౌరాణికాలు, మరోవైపు మాస్ కథలు ఏదైన కూడా ఆయన జానర్ లేదు. సింహా’, ‘లెజెండ్’, ‘డిక్టేటర్’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలతో అలరించారు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌గా రూపొందిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో 60కిపైగా గెటప్పుల్లో కనిపించి మెప్పించాడు.. ఇలా వరుసగా 110 సినిమాలకు పై నటించారు. ప్రస్తుతం ఆయన రెండు భారీ ప్రాజెక్టు లలో నటించి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు.
Also Read : ‘పొదరిల్లు’ లో మహా బాస్ విక్కీ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు సినిమాలు మాత్రమే కాదు.. మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో రానిస్తూ తనదైన శైలిలో ప్రజల మనసులో అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపును కైవసం చేసుకున్నాడు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు బాలయ్య. తండ్రి స్థాపించిన బసవ తారకం అనే క్యాన్సర్ ఆస్పత్రికి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆస్పత్రిలో సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతోమందికి ఉచితవైద్యం అందేలా కృషి చేస్తున్నారు.. ఈయన అటు రాజకీయాల్లో ఇటు సినిమాలు, సామాజిక సేవలు మరువలేనివి.. మన లెజెండరి హీరో బాలయ్య కు పద్మ భూషణ్ అవార్డు రావడం ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేవు..నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే బాలయ్య..