E-Paper
Advertisement

కియా To రెనాల్ట్.. రూ.20 లక్షల లోపు బెస్ట్ హైబ్రిడ్ కార్లు ఇవే!

కియా To రెనాల్ట్.. రూ.20 లక్షల లోపు  బెస్ట్ హైబ్రిడ్ కార్లు ఇవే!
Advertisement

New Affordable Hybrid Cars 2026: ఇండియన్ ఆటో మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, మంచి మైలేజ్ కావాలనే ఆలోచనతో చాలామంది వినియోగదారులు హైబ్రిడ్ కార్ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రూ.20 లక్షల లోపు ధరలో కొత్త SUVలు, కాంపాక్ట్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హ్యుందాయ్ బేయాన్ హైబ్రిడ్

హ్యుందాయ్ కంపెనీ బేయాన్ హైబ్రిడ్ ను వెన్యూ, క్రెటా మధ్య ప్లేస్ చేయాలని భావిస్తోంది. సెకెండ్ జెనరేషన్ బేయాన్‌ ను ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది. ఈ పవర్‌ ట్రెయిన్‌ కు e-CVT గేర్‌ బాక్స్‌ ను జతచేయనున్నారు. నెక్ట్స్ జెనరేషన్ i20తో కొన్ని భాగాలను షేర్ చేసుకోవడం వల్ల ధరను కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

⦿ కియా సోనెట్ హైబ్రిడ్

Advertisement

ప్రస్తుతం ఉన్న సోనెట్‌కు మంచి సపోర్టు రావడంతో న్యూ జెనరేషన్ మోడల్‌ పై కంపెనీ వర్కౌట్ చేస్తోంది. 2027లో రాబోయే ఈ SUVలో మొదట పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉండనున్నాయి. 2028 ఎండింగ్ లేదంటే, 2029 ప్రారంభంలో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ ను యాడ్ చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్ డెవలప్ చేస్తున్న 1.2 లీటర్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ ను ఇందులో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండొచ్చు.

⦿ మహీంద్రా విజన్ ఎస్

ఇక మహీంద్రా విజన్ ఎస్ కూడా టాప్ హైబ్రిడ్ SUVల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోనుంది. కంపెనీ కొత్త NU_IQ ప్లాట్‌ ఫారమ్‌ పై ఇది రెడీ అవుతోంది. ఇది నాలుగు మీటర్ల లోపు సబ్ కాంపాక్ట్ SUVగా వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్‌ తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ కూడా ఇందులో అందించనున్నారు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా ఈ హైబ్రిడ్ సిస్టమ్ పని చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

⦿ రెనాల్ట్ బ్రిడ్జర్

Advertisement

రెనాల్ట్ బ్రిడ్జర్ కూడా కొనుగోలుదారులలో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల కంపెనీ చూపించిన కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా ఈ SUV రూపొందనుంది. బాక్సీ డిజైన్, ఎత్తైన స్టాన్స్‌ తో ఈ కారు ప్రత్యేకంగా కనిపించనుంది. కొత్త డస్టర్‌ లో ఉపయోగిస్తున్న RGMP ప్లాట్‌ ఫారమ్‌ పైన దీనిని నిర్మించనున్నారు. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో ఇంజిన్‌ తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ వచ్చే అవకాశం ఉంది. ఈ SUV దాదాపు 30 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా. దీని ధర రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల మధ్య ఉండొచ్చు.

⦿ నిస్సాన్ న్యూ వెర్షన్

రెనాల్ట్ బ్రిడ్జర్ ఆధారంగా నిస్సాన్ సొంత వెర్షన్‌ ను తీసుకురానుంది. ఇది కూడా అదే ప్లాట్‌ ఫారమ్, అదే హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ ను ఉపయోగించనుంది. నిస్సాన్ భారత మార్కెట్లో తిరిగి సత్తా చాటేందుకు ఈ SUV కీలకంగా మారే అవకాశముంది.

Read Also: ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఏపీ జోరు.. 750 బస్సులు వచ్చేస్తున్నాయ్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×