Ramayana Hero: రామాయణం.. ఇప్పటికే రామాయణం పై ఎన్నో కథలు తెరపై దర్శనం ఇచ్చినా.. ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం అనిపిస్తుంది. అందుకే ఎంతో మంది దర్శకులు ఎవరికివారు తమ టాలెంట్ కు తగ్గట్టుగా ఈ సినిమాను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రామాయణం పై ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ హిందీలో కూడా నితీష్ తివారి రామాయణం సినిమాను తన క్రియేటివిటీకి తగ్గట్టుగా తెరపై చూపించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే రణబీర్ కపూర్ (Ranbir Kapoor)రాముడిగా, శాండిల్ వుడ్ స్టార్ హీరో యష్ (Yash)రావణాసురుడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు కూడా ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిన్న ఫస్ట్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఇందులో రణబీర్ పాత్ర పైనే అందరూ ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
రామాయణ హీరో పాత్ర పై భారీ ట్రోల్స్..
సాధారణంగా రాముడి పాత్ర ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. అలాంటి పాత్ర కోసం హీరోలను ఎంపిక చేసేటప్పుడు దర్శక నిర్మాతలు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు హిందీ రామాయణంలో రణబీర్ కపూర్ ని రాముడి పాత్ర కోసం ఎంపిక చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా బీఫ్ తినేవాడికి రాముడి పాత్ర అంటూ పాత విషయాలను బయటకు తీస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రాముడు పాత్రకు ఈయనను ఎంపిక చేశారు అని స్పష్టం చేసిన దగ్గర నుంచి.. శ్రీ రామచంద్రా… బీఫ్ తినేవాడికా రాముడి పాత్ర.. అంటూ హీరోపై ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
రామాయణ పార్ట్ – 1 సినిమా విశేషాలు..
హిందీ రామాయణ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం 2026 దీపావళి విడుదల చేస్తుండగా.. రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్ పై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. హై ఎండ్ వి ఎఫ్ ఎక్స్ ఆధారిత కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొదటి భాగం కోసం రూ.835 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ మూవీ కావడం విశేషం. ఇకపోతే ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్త, ఇంద్రుడిగా కునాల్ కపూర్, దశరధుడిగా అరుణ్ గోవిల్ నటిస్తున్నారు.
also read:Lavanya – Raj Tarun: రహస్యంగా ఆ పని చేసిన రాజ్ తరుణ్.. లావణ్య కథ ముగిసినట్టేనా?