Lavanya – Raj Tarun:టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్(Raj Tarun).. ఆయన లవర్ లావణ్య (Lavanya) ఇష్యూ గత కొద్ది రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది లావణ్య మీడియా ముందుకు వచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె రాజ్ తరుణ్ తనని వాడుకొని మోసం చేశాడని,పెళ్లి కూడా చేసుకున్నాడని, తన పేరెంట్స్ కూడా రాజ్ తరుణ్ కి ఆర్థికంగా చాలా సహాయం చేసారని,కానీ ప్రస్తుతం తనను వదిలేసి మరో హీరోయిన్ తో తిరుగుతున్నాడంటూ ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ – లావణ్య మధ్య గొడవ స్టార్ట్ అవ్వడానికి కారణం ఓ విల్లా అని తెలుస్తోంది..
విల్లా కోసం లావణ్య తిప్పలు..
ఇక విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అలా తెరమీదకి రాజ్ తరుణ్ లవర్ అంటూ లావణ్య రావడంతో ఆయన గురించి ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.ముఖ్యంగా ఆయనకు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయి అంటూ లావణ్య(Lavanya) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా లావణ్య రాజ్ తరుణ్ కలిసి కొన్న ఇంట్లోకి.. రాజ్ తరుణ్ పేరెంట్స్ వస్తే రానివ్వకుండా వీధిలో కూర్చోబెట్టింది..
లావణ్య కు షాక్ ఇచ్చిన కోర్టు..
దాంతో పోలీసులు వచ్చి మేటర్ సెటిల్ చేసి రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంట్లోకి వెళ్ళమని చెప్పారు. కానీ ఆ తర్వాత ఈ మ్యాటర్ కోర్టు దాకా వెళ్లడంతో కోర్టు లావణ్య కి షాకింగ్ తీర్పు ఇచ్చింది. లావణ్య, రాజ్ తరుణ్ కలిసి విల్లా (Villa) కొన్నట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవని, డాక్యుమెంట్లు లేకపోవడంతో రాజ్ తరుణ్ కి మాత్రమే ఆ విల్లా దక్కుతుందని, లావణ్యకు దానిపై ఎలాంటి అధికారం లేదు అని తేల్చి చెప్పింది. అలాగే ఇలాంటి ఆధారాలు లేని ఇష్యుని కోర్టు దాకా తీసుకువచ్చి కోర్టు సమయాన్ని వృధా చేయకూడదని,ఇంకా ఏమైనా కేసులు, గొడవలు ఉంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని తీర్పు ఇచ్చింది.దాంతో లావణ్య కు పెద్ద షాక్ తగిలినట్టు అయింది.
లావణ్యకు తెలియకుండా రహస్యంగా విల్లా అమ్మేసిన రాజ్ తరుణ్
అయితే తాజాగా రాజ్ తరుణ్, లావణ్యలు ఏ విల్లా గురించి అయితే గొడవ పడుతున్నారో ఆ విల్లా లావణ్యకి తెలియకుండా రాజ్ తరుణ్ అమ్మినట్టు తెలుస్తోంది.అయితే ఈ విల్లాని రాజ్ తరుణ్ గత కొద్ది రోజుల ముందే అమ్మారట.ఇక ఈ విల్లా అమ్మడంతో ఆ విల్లా కొన్నప్పుడు నేను కూడా సగం డబ్బులు కట్టాను. నన్ను అడగకుండా విల్లా ఎలా అమ్ముతారని లావణ్య రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే సడన్ గా మళ్లీ ఈ విల్లా విషయం తెర మీదకి రావడంతో లావణ్య మళ్ళీ రచ్చ స్టార్ట్ చేసి రాజ్ తరుణ్ పై మండి పడింది.. మరి రాజ్ తరుణ్ విల్లా విషయం గురించి నోరు విప్పుతారా అనేది తెలియాల్సి ఉంది.
విల్లా కోసం మళ్లీ రచ్చ చేస్తున్న లావణ్య..
ఏది ఏమైనప్పటికీ ఎప్పటిలాగే మళ్ళీ లావణ్య విల్లా ఇష్యూపై మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ పై ఫైర్ అయింది. మరి ఈ విల్లా విషయం ఓ కొలిక్కి వస్తుందా.. లావణ్యకి కూడా ఈ విల్లాలో వాటా వస్తుంది అని రాజ్ తరుణ్ ఒప్పుకుంటారా.. లేక ఆ విల్లాతో లావణ్య కు ఎలాంటి సంబంధం లేదు అని వెళ్లిపోమంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.మరి ఈ విల్లా విషయం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.
also read:Kotthapalli lo Okappudu Teaser: రానా ప్రజెంట్ చేస్తున్న మూవీ.. టీజర్ వచ్చేసింది.. చూశారా ?