Pocket Rockkets Teaser : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి అనంతరం నిర్మాతగా మంచి సక్సెస్ అందుకుంటున్న మెగా డాటర్ నిహారిక (Niharika)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన నిహారిక పెద్దగా సక్సెస్ అందుకోలేదు ఈ నేపథ్యంలోనే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్స్ స్థాపించి నిర్మాతగా మారారు. కెరియర్ మొదట్లో వెబ్ సిరీస్ లను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్న నిహారిక ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇటీవల రాకాసా అంటూ ప్రేక్షకులను భయపెట్టిన ఈమె త్వరలోనే పాకెట్ రాకెట్స్(Pocket Rockkets) అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో మెప్పించిన త్రినాథ్ వర్మ, నటుడు నిర్మల్ హీరోలుగా సందడి చేయగా,’శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్ పాత్రలో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ చిత్ర బృందం తెలియజేశారు.
పాకెట్ రాకెట్స్ చిత్ర బృందం నిహారిక ఇంటి ముందు నిలబడి నిహారిక నెపోటిజం చూపిస్తున్నారు.. బరి నుంచి బయటకు రాని నిహారిక అంటూ ప్ల కార్డ్స్ పట్టుకొని ధర్నా చేస్తూ వచ్చారు. అయితే తమకు కూడా న్యాయం జరగాలని తమ సినిమా పాకెట్ రాకెట్స్ ప్రమోషన్స్ చేయాలి అంటూ సరదాగా ఈ ప్రమోషనల్ వీడియో షేర్ చేశారు. ఇందులో భాగంగా నిహారిక అందరిని బెదిరిస్తూనే పాకెట్ రాకెట్స్ సినిమాకు సంబంధించి అప్డేట్ తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు.
?rpxt=cmRpNHR1Ymw5aWd1
ఈ సినిమా టీజర్ నవంబర్ 3 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు AAA సినిమాస్ లో విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఈ సరదా ప్రమోషనల్ వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా ద్వారా రుద్ర అత్రి దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే…విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే బలమైన కోరిక ఉన్న ఒక పేద మధ్యతరగతి యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇలా విభిన్నమైన కథలతో నిహారిక ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈమె తన అన్నయ్య వరుణ్ తేజ్(Varun Tej) తో కలిసి బరి (Bhari)అనే సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
Also Read: నాన్న అరెస్ట్ తట్టుకోలేకపోయాను..పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్!