Jim Jim Tara Singer Lakshmi Devi: జిమ్ జిమ్ తార అనే పాటతో సెన్సేషనల్ గా మారిపోయారు సింగర్ లక్ష్మీదేవి(Lakshmi Devi). చిన్నప్పుడు సరదాగా పాడుకునే పాటను ఈమె ఇంస్టాగ్రామ్ లో పాడుతూ ఒక రీల్ వీడియో షేర్ చేశారు. ఇక ఈ పాట క్షణాలలో వైరల్ అవ్వడంతో ఈ పాటను పర్ణశాల సినిమా(Parnashala Movie)లో పెట్టారు ఇప్పటికే ఈ సినిమా నుంచి పాట విడుదల చేయగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాటను ఎలాంటి అనుమతి లేకుండా వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbham)సినిమాలో 15 సెకండ్లు ఉపయోగించడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.
ఇలా తమ అనుమతి లేకుండా ఈ పాటను ఆదర్శ కుటుంబం సినిమాలో పెట్టారంటూ పర్ణశాల నిర్మాత సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా సింగర్ లక్ష్మీదేవి చేత ఈ ఘటనపై ఒక వీడియోని విడుదల చేయించారు. ఎవరి అనుమతి తీసుకొని ఈ పాటను మీ ఆదర్శ కుటుంబం సినిమాలో పెట్టుకున్నారు. వెంటనే ఈ పాటను తీసేయండి లేదంటే తాను కేసు వేస్తానని సింగర్ లక్ష్మీదేవి ఆదర్శ కుటుంబం సినిమా బృందానికి వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఉన్నఫలంగా లక్ష్మీదేవి ఈ వీడియోని డిలీట్ చేశారు.
తాజాగా ఈమె మరొక వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. తాను ఆదర్శ కుటుంబం సినిమాలో తమ పాటను పెట్టారని కేసు వేస్తానంటూ ఒక వీడియో చేశాను అయితే అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండని ఈమె కోరారు. తన పాటను పర్ణశాల సినిమాకు ఇచ్చాను. ఆ పాటతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఆదర్శ కుటుంబం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడే ఈ పాట పెట్టుకున్నారట ఆ విషయం నాకు తెలియదు. నేను వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమా గురించి సంగీత దర్శకుడి గురించి తప్పుగా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించండి అంటూ ఈమె క్షమాపణలు చెబుతూ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది.
?obrf=Zjd6MDYzc2Q2cGk2
ఇలా తన పాటను ఎవరి అనుమతితో పెట్టారంటూ ఘాటుగా విమర్శలు చేసిన సింగర్ లక్ష్మీదేవి ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఆ పాటతో నాకు సంబంధం లేదంటూ మరొక వీడియోని విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఆదర్శ కుటుంబం సినిమాలో కేవలం 15 సెకండ్ల పాటు ఈ పాట ఉపయోగించడంతో గత రెండు రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఆదర్శ కుటుంబం చిత్ర బృందం కానీ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ కానీ ఎక్కడ స్పందించలేదు.
Also Read: నెపోటిజం చూపిస్తున్న నిహారిక.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన టీమ్!