E-Paper
Advertisement

ఢిల్లీ ప్రజలకు శుభవార్త.. ‘గ్రీన్ క్రాకర్స్’ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి!

ఢిల్లీ ప్రజలకు శుభవార్త.. ‘గ్రీన్ క్రాకర్స్’ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి!
Advertisement

Supreme Court: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి సందర్భంగా నవంబర్ 7, 8 తేదీల్లో ‘గ్రీన్ క్రాకర్స్’ (Green Firecrackers) కాల్చుకోవడానికి అనుమతినిచ్చింది. సంపూర్ణ నిషేధం విధించడానికి తగినంత డేటా లభించకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి నవంబర్ 9 నుంచి పటాకులపై సంపూర్ణ నిషేధం అమలులోకి వస్తుందని తేల్చి చెప్పింది.

బాణసంచా కాల్చే సమయాలు

దీపావళి పండుగ ముందు రోజు, పండుగ రోజున పటాకులు కాల్చుకోవడానికి నిర్దిష్ట సమయాలను సైతం సుప్రీంకోర్టు కేటాయించింది. ఉదయం 6:00 నుంచి 7:00 గంటల వరకు, తిరిగి రాత్రి 8:00 నుంచి 10:00 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని ఆదేశించింది. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు, నోటిఫై చేసిన సైలెంట్ జోన్లలో గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి వీల్లేదని దిశానిర్దేశం చేసింది. వాటికి 300 మీటర్ల పరిధిలో ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాలను ‘నో-క్రాకర్ జోన్లు’గా గుర్తించి, గ్రౌండ్‌పై మార్కింగ్ చేయాలని, బహిరంగంగా ప్రకటించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

అందుకే సంపూర్ణ నిషేధం లేదు: సుప్రీం

Advertisement

దేశరాజధానిలో బాణసంచాపై సంపూర్ణ నిషేధమే పరిష్కారంగా అనిపించినప్పటికీ.. దానికి సంబంధించి తగిన ఆధారాలు, డేటా లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2024లో విధించిన సంపూర్ణ నిషేధం వల్ల గాలి నాణ్యత (AQI)లో పెద్దగా మార్పు ఏమీ రాలేదని పేర్కొంది. ఆ నిషేధం ఎంతవరకు సత్ఫలితాలను ఇచ్చిందో స్పష్టమైన డేటా సమర్పించలేదని పేర్కొంది. అయితే దీపావళి అనేది ప్రజల భావోద్వేగాలు, సంస్కృతితో ముడిపడి ఉన్న పండుగ అని పేర్కొంటూనే.. పర్యావరణాన్ని పాడుచేసి ఆరోగ్య ప్రమాదాలు కొనితెచ్చుకోవడం పండుగ ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది.

Also Read: విమాన ప్రయాణం వేస్ట్.. ఈ రైలు జర్నీనే బెస్ట్.. 5-స్టార్ హోటల్ ఫీలింగ్!

ఇంతకీ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి?

Advertisement

నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CSIR-NEERI) అభివృద్ధి చేసిన గ్రీన్ క్రాకర్స్.. సాధారణ పటాకుల కంటే 30 శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. వీటిలో బేరియం, అల్యూమినియం వంటి ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని తగ్గించారు. దుమ్ము, పొగను అణచివేసే ప్రత్యేక రసాయనాలను ఇందులో వాడతారు. ఇవి తక్కువ శబ్దాన్ని చేస్తూ.. తక్కువ సమయం పాటు మాత్రమే మండుతాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో చర్చించి గ్రీన్ క్రాకర్స్ విక్రయాల కోసం ప్రత్యేక ప్రదేశాలను కేటాయించాలని ఢిల్లీ సర్కార్ ను కోర్టు ఆదేశించింది. విక్రయ కేంద్రాలు, దుకాణాల వద్ద వినియోగదారులు CSIR-NEERI ఆమోదించిన గ్రీన్ పటాకులను ఎలా గుర్తించాలో వివరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Also Read: ఆన్‌లైన్ హోటల్ రివ్యూలు చూసి మోసపోతున్నారా? ఫేక్ రివ్యూలను కనిపెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!

Tags

Related News

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగలు తగిలి 8 మంది కార్మికులు బలి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు దుర్మరణం!

ప్రభుత్వ ఉద్యోగం.. ఓఎన్‌జీసీలో 3047 జాబ్స్.. త్వరగా అప్లై చేయండి

భార్య ప్రేమ కోసం తెగించాడు.. దొంగగా మారి కారుని కొట్టేసిన భర్త, మధ్యప్రదేశ్‌లో ఘటన

మేము కొట్టం.. తిట్టం.. కానీ? మోడీ, అమిత్ షాలకు రాహుల్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ మెసేజ్!

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై.. మమత బెనర్జి సంచలన సెటైర్లు!

రైల్వే జాబ్స్.. 1,215 స్టేషన్ మాస్టర్ ఖాళీలు.. డిగ్రీ అంటే చాలు

Big Stories

Advertisement
×