E-Paper
Advertisement

తెలంగాణ పోలీసులు చేసిన ఆ ఒక్క పనితో.. 20.2 శాతం తగ్గిన సైబర్ ఆర్థిక నష్టాలు!

తెలంగాణ పోలీసులు చేసిన ఆ ఒక్క పనితో.. 20.2 శాతం తగ్గిన సైబర్ ఆర్థిక నష్టాలు!
Advertisement

Cyber Security: సైబర్‌ నేరాలపై ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అక్టోబర్ లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. ఇందులో భాగంగా అక్టోబరు 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు యూనిట్ల పరిధిలో రాత్రి వేళల్లో సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ వాక్‌ లు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సైబర్‌ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. నిరంతర అప్రమత్తత, సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా సైబర్‌ మోసాలను అరికట్టవచ్చనే సందేశాన్ని చాటిచెప్పారు.

డీజీపీ ముఖ్య అతిథిగా..

అక్టోబరు 1న హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్లాష్‌ వాక్‌ తో ఈ నెల రోజుల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లు విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ సమావేశాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలు, దాండియా వేడుకలను వేదికలుగా చేసుకుని వివిధ వర్గాల ప్రజలకు సైబర్‌ భద్రతపై సందేశాలు అందించాయి.

15.48 లక్షల మందికి అవగాహన..

Advertisement

సైబర్‌ భద్రతపై అవగాహనను ఒక్క నెలకే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా కొనసాగించేలా TGCSB కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా 2026 అక్టోబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,886 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 15,48,905 మందికి సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 4,248 కార్యక్రమాల ద్వారా 2,78,428 మందికి చేరువయ్యారు. మారుతున్న సైబర్‌ నేరాల తీరును గుర్తించి, మోసాల పద్ధతులు, బాధిత వర్గాల ఆధారంగా ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేశారు. ‘ఆన్‌ లైన్‌ బట్‌ అన్‌ అఫ్రైడ్‌’, ‘సురక్షా కా తిరంగా’, ‘పాజ్‌.. థింక్‌.. వెరిఫై..’, ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’ వంటి ప్రచారాల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచారు.

Also Read: ఖమ్మంలో స్త్రీ నిధి నిధుల గోల్‌మాల్.. 21 మహిళా సంఘాల డబ్బులు నొక్కేసిన గ్రామ దీపిక!

సైబర్‌ నష్టాలు 20.2 శాతం తగ్గుదల..

Advertisement

సైబర్‌ నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయి. 2025 జనవరి నుంచి సెప్టెంబరు వరకు సైబర్‌ నేరాల వల్ల నమోదైన ఆర్థిక నష్టం 1,104.42 కోట్లు కాగా, 2026లో ఇదే కాలానికి 881.72 కోట్లకు తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే 222.70 కోట్లు (20.2 శాతం) మేర నష్టం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సైబర్‌ మోసగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని నగదును ఫ్రీజ్ చెయ్యటంలో కూడా గణనీయమైన పురోగతి నమోదైంది. 2025 జనవరి–సెప్టెంబరు మధ్య 183.11 కోట్లను ఫ్రీజ్ చెయ్యగా 2026లో ఇదే కాలానికి 260.30 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే రూ.77.19 కోట్లు (42.2 శాతం) అధికంగా నిలిపివేశారు.

1930కు వెంటనే ఫోన్‌ చేయాలి..

ఆన్‌ లైన్‌ పెట్టుబడులు, ఆర్థిక ఆఫర్ల విషయంలో పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛీఫ్ శిఖా గొయల్ సూచించారు. ఓటీపీలు, పిన్‌ నెంబర్లు, పాస్‌ వర్డ్‌ లను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్‌ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ కు ఫోన్‌ చేయాలన్నారు. www.cybercrime.gov.in వెబ్‌ సైట్‌ లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Also Read: ఇక విదేశాల్లోనూ వందే భారత్ పరుగులు.. రైల్వేమంత్రి సంచలన ప్రకటన!

Tags

Related News

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2పై కేంద్రం బిగ్ అప్‌డేట్.. రూ. 275 కోట్ల నిధులు మంజూరు!

ఖమ్మంలో స్త్రీ నిధి నిధుల గోల్‌మాల్.. 21 మహిళా సంఘాల డబ్బులు నొక్కేసిన గ్రామ దీపిక!

ఆయిల్‌పామ్ సాగులో.. తెలంగాణ రాష్ట్రం సరికొత్త చరిత్ర..!

తెలంగాణ ఈఎస్ఐ ఆసుపత్రి టెండర్లలో.. రూ. 50 కోట్ల కుంభకోణం?

గడ్డం, మీసం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా? కేటీఆర్‌పై వేముల వీరేశం సంచలన కామెంట్స్!

హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్‌ మేళా.. మంగళవారం నుంచి స్లాట్ విడుదల, ఇంకెందుకు ఆలస్యం

బీజేపీ యాక్టివ్ కావడంతో రూటు మార్చిన బీఆర్ఎస్.. 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర, ప్రజలతో ఉండేందుకు..

Big Stories

Advertisement
×