E-Paper
Advertisement

ఏపీ సీఎంను కలిసిన బెల్లం కొండ ఫ్యామిలీ… శ్రీనివాస్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!

ఏపీ సీఎంను కలిసిన బెల్లం కొండ ఫ్యామిలీ… శ్రీనివాస్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
Advertisement

Bellam Konda Srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరొక హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్(Sai Srinivas) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రియురాలు కావ్య రెడ్డి(Kavya Reddy)తో పెళ్లికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎంను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ..

వీరి నిశ్చితార్థం ఏప్రిల్ 5వ తేదీ పూర్తికాగా, ఈనెల 29వ తేదీ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే వీరి వివాహ లగ్నపత్రిక వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఇక పెళ్లికి సమయం కూడా పెద్దగా లేకపోవడంతో బెల్లంకొండ కుటుంబ సభ్యులు పలువురు సినీ రాజకీయ ప్రముఖులను కలిసి సాయి శ్రీనివాస్ పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తల్లిదండ్రులు సోదరుడు కుటుంబ సమేతంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాజరుకానున్న సినీ రాజకీయ ప్రముఖులు..

Advertisement

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో జరగబోతున్న సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగినా, వీరి వివాహ రిసెప్షన్ మాత్రం చాలా ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. ఈ వివాహ రిసెప్షన్ లో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. వీరి పెళ్లి వేడుకలలో భాగంగా సన్నిహితులు కుటుంబ సభ్యులు కలిసి సుమారు 300 మంది వరకు హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇక మే ఒకటవ తేదీ హైదరాబాద్ లో వీరి వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నారు.

మే 1 న వెడ్డింగ్ రిసెప్షన్..

Advertisement

ఈ వివాహ రిసెప్షన్ కోసమే రాజకీయ ప్రముఖులను కలిసి ఆహ్వానం అందజేస్తున్నారు. శ్రీనివాస్ పెళ్లి వేడుకలలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నటు సమాచారం. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక కావ్య రెడ్డి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు ఈమె తాత హైకోర్టు జడ్జ్ కాగా తండ్రి లాయర్ అని తెలుస్తుంది. ఇలా ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి కావ్య రెడ్డి సినిమా ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు.

Also Read: ఆ సినిమా కోసం హన్సిక అలాంటి ఇంజెక్షన్లు వాడిందా..ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×