Hindustan Aeronautics Jobs| రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 2026 నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 120 డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఎల్జిబుల్ ఇంజినీరింగ్ డిగ్రీ కలవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ జూలై 29, 2026న ప్రారంభమైంది. ఆగస్టు 14, 2026 మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
మొత్తం 60 డిజైన్ ట్రైనీ, 60 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ భర్తీ చేయనుంది.
ఏరోనాటికల్ 4 ఖాళీలు,
ఎలక్ట్రికల్ 7,
ఎలక్ట్రానిక్స్ 20,
ఇన్‌స్ట్రుమెంటేషన్ 3,
మెకానికల్ 22,
మెటలర్జీకి 1,
కంప్యూటర్ సైన్స్ 3 ఖాళీలున్నాయి.
ఎలక్ట్రికల్ – 11,
ఎలక్ట్రానిక్స్ – 12,
మెకానికల్ 27,
కంప్యూటర్ సైన్స్ – 1,
మెటలర్జీ – 2,
ప్రొడక్షన్ – 5,
సివిల్ – 2 పోస్టులు ఉన్నాయి.
దేశంలోని వివిధ HAL కేంద్రాల్లో ఎంపికైన అభ్యర్థులను నియమిస్తారు. బెంగళూరు, తుమకూరు, హైదరాబాద్, నాసిక్, కొరాపుట్, బరాక్‌పూర్, లక్నో, కాన్పూర్, కొర్వా కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అభ్యర్థులు ఉత్పత్తి విభాగాలు, పరిశోధన కేంద్రాలు, సేవా విభాగాలు లేదా కార్యాలయాల్లో పనిచేస్తారు.
అభ్యర్థులు సంబంధిత విభాగంలో పూర్తి కాల బీఈ లేదా బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఓబీసీ-ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు పొందాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్వ్యూకు ముందు డిగ్రీ పూర్తి చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
ఆగస్టు 14, 2026 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జనరల్, ఓబీసీ – ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, HAL అంతర్గత ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
మొదట దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు బెంగళూరులో వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 160 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 20, ఇంగ్లీష్, రీజనింగ్ నుంచి 40, సంబంధిత ఇంజినీరింగ్ విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ భాషను ఎంచుకోవచ్చు. తుది మెరిట్ జాబితాలో రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజ్ ఇస్తారు.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు
ఎంపికైన అభ్యర్థులు 52 వారాల శిక్షణ పొందుతారు. శిక్షణ సమయంలో నెలకు రూ.50,000 ప్రాథమిక వేతనం అందుతుంది. అదనంగా వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్ కూడా లభిస్తాయి. కంపెనీ నిబంధనల ప్రకారం వసతి సౌకర్యం కల్పిస్తారు.
శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులను గ్రేడ్-2 ఇంజినీర్లుగా నియమిస్తారు. వేతన శ్రేణి రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది. వైద్య సదుపాయాలు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తారు. శిక్షణ అనంతరం ఐదేళ్ల సేవా బాండ్‌పై సంతకం చేయాలి.
Also Read: RRB గ్రూప్ D పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీలు, అడ్మిట్ కార్డ్ వివరాలు ఇవిగో
ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 29, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 14, 2026. అడ్మిట్ కార్డులు ఆగస్టు 20, 2026న విడుదల చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలు సెప్టెంబర్ 5, 6, 2026 తేదీల్లో జరుగుతాయి. ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 21 నుంచి 25, 2026 వరకు నిర్వహిస్తారు. శిక్షణ కార్యక్రమం అక్టోబర్ 29, 2026 నుంచి ప్రారంభమవుతుంది.