Bharata Varsha:టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భరత వర్ష’. జాతీయ అవార్డు గ్రహీత సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ కలిగించగా తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ సినిమాపై బజ్ మరింత పెంచేసింది.
అమ్మ కదలి వచ్చే’ అంటూ
ఈ సినిమా నుంచి ‘అమ్మ కదలి వచ్చే’ అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ పాటలో అటు డివైన్ టచ్ తో పాటు, ఇటు అందించిన బీట్స్ కూడా అదిరిపోయాయనే చెప్పాలి. ఒకరకంగా పాట వింటుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
ఇక దీనికి అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ‘కాంతార’ సినిమా గుర్తుకొచ్చేలా ఉందంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు మూవీ లవర్స్. చూస్తుంటే ‘భరత వర్ష’ గోపీచంద్ ఖాతాలో మరో సరికొత్త సక్సెస్ ఫుల్ నిలిచేలానే కనిపిస్తుంది.
ఇక పాటలో చూపించిన అగ్ని పర్వతాలు, లావా ప్రవాహాలు, మంటలు..ఇలా ప్రతీ విజువల్ లోనూ గ్రాండియర్ లుక్ కనిపిస్తుంది. మాములుగా పీరియాడిక్ సినిమాలంటే రాజ్యాలు, కోటలు, యుద్ధాలతో నిండిపోయి ఉంటుంది. . కానీ ‘భరత వర్ష’ విజువల్స్ చూస్తుంటే కథ డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో సాగుతుందనే క్యూరియాసిటీ కనిపిస్తుంది.
గోపీచంద్ విషయానికి వస్తే
ఇక గోపీచంద్ విషయానికి వస్తే, యాక్షన్ సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపు ఉందన్న సంగతి చెప్పక్కర్లేదు. కెరీర్ మొదట్లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ వంటి సినిమాల్లో విలన్గా కనిపించిన గోపీచంద్, ఆ తర్వాత ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే.
ఇక హీరోయిన్ రీతూ వర్మ కూడా ఈ సినిమాలో తన లుక్స్తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఆడియన్స్ కి దగ్గరైన ఈ హైదరాబాదీ సరికొత్త కథల్ని ఎంచుకుని సత్తా చాటుతుంది.ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000 KMPH’ వంటి సినిమాలతో ఆడియన్స్ లో మంచి పేరే తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘ఘాజీ’లో సముద్రం అడుగున జరిగే యుద్ధాన్నిచూపించిన తీరుకి ఫిదా అయ్యారంతా.
ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను త్వరలో అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. చూడాలి మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !