E-Paper
Advertisement

Lenin Movie : ‘లెనిన్’ మూవీకి బిగ్ షాక్.. అక్కడ ఆపేయ్యాలని డిమాండ్.. అసలు ఏం జరుగుతుంది..?

Lenin Movie : ‘లెనిన్’ మూవీకి బిగ్ షాక్.. అక్కడ ఆపేయ్యాలని డిమాండ్.. అసలు ఏం జరుగుతుంది..?
Advertisement

Lenin Movie : అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్.. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ జులై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా అఖిల్ ఈ సినిమాలో యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నాడు. కేవలం కొన్ని గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ మూవీ గురించి తాజాగా షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. డిస్ట్రిబ్యూటర్స్ వివాదం ఈ సినిమాపై పడనుందని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో షికారు చేస్తుంది.. కొన్ని ఏరియాలో సినిమాని ఆపేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం.. మరి ఇందులో నిజం ఎంత ఉందో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

డిస్ట్రిబ్యూటర్స్ వివాదం.. లెనిన్ కు సెగ..

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ చిత్రం లెనిన్.. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఊర మాస్ గ్రామీణ స్టోరీగా రాబోతుంది.. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. సినిమా కేవలం కొన్ని గంటల్లోనే థియేటర్లలోకి రాబోతుంది.. నేపథ్యంలో ఈ మూవీకి బిగ్ షాక్ ఎదురైంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ వివాదం కాస్త లెనిన్ మూవీ మీద ఎఫెక్ట్ చూపించబోతుందని ఓ వార్త వినిపిస్తుంది.. వీళ్లు ఏకమయ్యి ఈ సినిమాని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ వీళ్లు ఈ మూవీ విడుదల పై చర్చలు జరిపి సినిమా విడుదలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్..’ఏ-గ్రేడ్’ కేంద్రాలలో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ ఓపెనింగ్‌లను సాధించడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో , ‘సి-గ్రేడ్’ కేంద్రంలోని రెండు థియేటర్లలో సినిమాను విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వివాదం కాస్త ముదరడంతో ఈ మూవీ విడుదలకు ఎక్కడ అడ్డుపడుతుందో అని చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుంది. మరి దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

ఇండస్ట్రీలో అసలు వివాదం ఏంటి…? 

Advertisement

అసలు విషయానికొస్తే.. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీక్లీ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ అంటే పర్సెంటెజ్ విషయంలో అటు నిర్మాతల మండలికి, ఎగ్జిబిటర్లకు మధ్య గత కొంతకాలంగా పంచాయితీ నడుస్తోంది.. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతున్న విషయం తెలిసిందే.. తమ నిబంధనలకు ఒప్పుకుంటేనే సినిమాలను ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు భీష్మించుకోగా.. పర్సంటేజీ పద్ధతికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ససేమిరా అంటోంది.. మైత్రి నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాలను సింగిల్ స్క్రీన్ లపై ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు ఫిక్స్ అయ్యారు.. అయితే ఇప్పటివరకు జరిపిన చర్చలు అన్నీ ఈ విఫలమవడంతో సినిమాల విడుదల కష్టంగా మారింది. ఇప్పటివరకు ఎటువంటి వివాదాలు కొనసాగినా కూడా సినిమాలు మాత్రం యధావిధిగా విడుదల అవుతూనే ఉన్నాయి.. కాని ఇప్పుడు మరోసారి లెనిన్ మూవీ పై ఆ ఎఫెక్ట్ పడబోతుందని తెలుస్తుంది.. మరి ఈ గొడవలు సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.. ఏది ఏమైనా కూడా భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Related News

బాలీవుడ్‌ను కుదిపేసిన ఆత్మహత్య: 18 ఏళ్లకే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్..

ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఘోర విషాదం.. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న ప్రముఖ నటుడు!

టాలీవుడ్‌లో మరో డైరెక్టర్-హీరోయిన్ లవ్ ట్రాక్.. సైలెంట్‌గా పెళ్లి పీటల వైపు అడుగులు!

‘మనం’ తర్వాత మళ్లీ అఖిల్ కోసమే …నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

కన్నీరు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమాని స్టోరీ.. ‘ఓజీ 2’ టీమ్ తీసుకున్న నిర్ణయానికి అంతా ఫిదా!

సినిమా హిట్.. డైరెక్టర్ చేతిలో కొత్త కార్ కీ: ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గురూ !

స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

Big Stories

Advertisement
×