E-Paper
Advertisement

సినిమా హిట్.. డైరెక్టర్ చేతిలో కొత్త కార్ కీ: ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గురూ !

సినిమా హిట్.. డైరెక్టర్ చేతిలో కొత్త కార్ కీ: ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గురూ !
Advertisement

Thaai Kizhavi: సినిమా హిట్టు పడిందా ..అయితే టీమ్ మెంబర్స్ కి షీల్డ్స్ ఇచ్చేద్దాం,డబ్బులు బాగా వచ్చాయా…అయితే స్ట్రిబ్యూటర్లకు లాభాల వాటాలు పంచేద్దాం,వంద రోజులు కంప్లీట్ అయ్యాయా అయితే భారీ ఈవెంట్ ప్లాన్ చేద్దాం. ఇదీ ఒకప్పటి ట్రెండ్.కానీ కాలం మారింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు సినిమా సాలిడ్ వసూల్లని చూస్తె చాలు ఆ సినిమా తీసిన డైరెక్టర్ కి బ్రాండ్ న్యూ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇవ్వడం ఇక్కడ కామన్ అయిపొయింది.ఇక లేటెస్ట్ గా ఇదే సీన్ తమిళ నాట రిపీట్ అయింది.

సక్సెస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో

విషయంలోకి వస్తే ‘శివకార్తికేయన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ కం ప్రొడ్యూసర్ ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) అనే సినిమాని నిర్మించిన సంగతి తెల్సిందే. జూలై 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సాలిడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా బ్లాక్ బస్టర్ ట్యాగ్ వేసుకుంది.ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్‌కు సరికొత్త ‘మహీంద్రా BE 6’ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు నిర్మాత శివకార్తికేయన్.“మనం ఎప్పటికీ గర్వపడే ప్రయాణానికి ఇదొక ప్రత్యేక కానుక” అంటూ ప్రొడక్షన్ హౌస్ ఈ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయిపొయింది.

Advertisement

also read:స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

‘విక్రమ్’ సూపర్ హిట్ అయినప్పుడు కూడా 

నిజానికి ఇలాంటి ఖరీదైన గిఫ్ట్‌లు మూవీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు.గతంలో ‘విక్రమ్’ సినిమా సూపర్ హిట్ అయినప్పుడు లెక్సస్ కారును లోకేష్ కనకరాజ్‌కు కానుకగా ఇచ్చాడు కమల్. ఇక సూర్యకు రోలెక్స్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడమూ మనకు తెల్సిందే. ఇక మన టాలీవుడ్ లో మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప వంటి భారీ సక్సెస్ ఇవ్వడంతో కాస్ల్టీ కార్ ని ఇవ్వగా ,‘సార్’ సక్సెస్ తో ధనుష్ వెంకీ అట్లూరికి కూడా కార్ ఇచ్చి తన ప్రేమని చాటుకున్నాడు.మొత్తానికి అదే ట్రెండ్ ని ఇపుడు శివకార్తికేయన్ ఫాలో అయ్యాడన్న మాట.

‘తాయ్ కిళవి’ మరోసారి నిరూపించిందన్న మాట !

Advertisement

‘తాయ్ కిళవి’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన రాధికా సినిమాని తన భుజాలపై మోసిందనే చెప్పాలి. ఇక సినిమా కూడా పెద్ద స్టార్ సినిమాలలాగా భారీగా టికెట్ ధరలు పెంచకుండానే , సాధారణ టికెట్ రేట్లతోనే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించి 100 రోజులు ఆడటం ఇక్కడ విశేషం.. మొత్తానికి, కంటెంట్ ఉన్న సినిమా తీస్తే బాక్సాఫీస్ హిట్‌తో పాటు, దర్శకులకు ఇలాంటి లగ్జరీ కార్ల గిఫ్ట్‌లు కూడా క్యూ కడతాయని ‘తాయ్ కిళవి’ మరోసారి నిరూపించిందన్న మాట !

also read:ఆ డ్రామా నా వల్ల కాదు.. భాగ్యరాజ్ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!

Related News

కన్నీరు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమాని స్టోరీ.. ‘ఓజీ 2’ టీమ్ తీసుకున్న నిర్ణయానికి అంతా ఫిదా!

స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

అఖిల్ లెనిన్ మూవీకి సెన్సార్ షాక్.. నిర్మాతలు ఏం చేస్తున్నారంటే?

సోదరి అన్షు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వీ వాచ్.. ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!

చాపెల్ వివాదం నుండి లార్డ్స్ గర్జన వరకు.. గంగూలీ బయోపిక్‌పై భారీ అంచనాలు!

సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

సడెన్ గా ఓటీటీకి వచ్చేసిన సింగీతం మ్యాజిక్.. ఎందులో చూడాలో తెలుసా?

Big Stories

Advertisement
×