Jiah Khan: సినీ ఇండస్ట్రీ.. ఈ గ్లామర్ వరల్డ్ వెనుక కనిపించే మెరుపులు ఎంత నిజమో దాని వెనుక ఉన్న చీకటి కూడా అంతే నిజం .సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన ఎంతోమంది తారలు అనుకోకుండా కనుమరుగయిపోయిన వారే .అలా కేవలం మూడు సినిమాలతోనే నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ నటి జియాఖాన్ డెత్ కూడా ఒక మిస్టరీయే .
జియాఖాన్ విషయానికి వస్తే 1988 ఫిబ్రవరి 20న న్యూయార్క్‌లో జన్మించిన జియా తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది .ఇక తల్లి రాబియా అమీన్ తో కలిసి లండన్ చేరుకున్న జియాఖాన్ అక్కడే కథక్, సల్సా, బ్యాలే వంటి నృత్యాల్లో ట్రైనింగ్ పొందింది .ఇక ఆపై నటనపై ఉన్న ప్యాషన్ తో న్యూయార్క్ లోని లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది.అలా చదువు మధ్యలోనే ఆపేసిన జియా కేవలం 18 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.
64 ఏళ్ల నటుడి పక్కన 18 ఏళ్ల యువతిగా
ముఖ్యంగా 2007లో సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన నిశ్శబ్ధ్’ సినిమాతో అమితాబ్ బచ్చన్ సరసన నటించి బీటౌన్ లో హాట్ టాపిక్ అయిపోయింది.64 ఏళ్ల నటుడి పక్కన 18 ఏళ్ల యువతిగా ఆమె పండించిన ఎక్స్ప్రెషన్స్ ఫిలింఫేర్ బెస్ట్ ఫిమేల్ డబ్ల్యు నామినేషన్ తెచ్చిపెట్టాయి .ఇక ఆ తర్వాత గజినీలో , అలాగే అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ సినిమాల్లో మెరిసి తక్కువ సమయంలోనే 300 కోట్లకు పైగా వసూలు సాధించిన సినిమాల్లో తను ఒక భాగమైంది.
2013 జూన్ 3న ముంబైలోని జుహు అపార్ట్మెంట్లో
అలా కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే 2013 జూన్ 3న ముంబైలోని జుహు అపార్ట్మెంట్లో ఉరివేసుకొని విగత జవిగా కనిపించడం మొత్తం దేశానికే పెద్ద షాక్.అయితే ఆమె మరణం తర్వాత లభించిన 6 పేజీల సూసైడ్ నోట్ కేసును మరో మలుపు తిప్పింది. తన లవర్, నటుడు సూరజ్ పంచోలి తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, శారీరకంగా మానసికంగా టార్చర్ పెట్టడమే కాకుండా బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆ లేఖలో తెలిపింది.దీంతో 2013 జూన్ 10న సూరజ్ ని పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేసినప్పటికీ జులై రెండున బాంబే కోర్ట్ అతనికి బెయిల్ ఇచ్చింది.
పక్కా ప్రణాళికతో జరిగిన హత్య
అయితే ఇది ఆత్మహత్య కాదు పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని జియాతల్లి రాబియా అమీన్ మొదటి నుంచి గట్టిగా వాదించింది.ఈ క్రమంలోనే కేసు సిబిఐ కి వెళ్ళినప్పటికీ 2016లో సిబిఐ కూడా ఇది ఆత్మహత్య అని తేల్చేయడం గమనార్హం.కానీ రాబియా లండన్ కి చెందిన రాబియా లండన్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు జాసన్ పేన్ జేమ్స్ నివేదికని తెరపైకి తెచ్చింది .జియ ముఖం, మెడ పై ఉన్న గుర్తులు,గాట్లు చూస్తే ఇది ఆత్మహత్యలా కనిపించడం లేదని ఆ రిపోర్ట్ లో ఉన్న సారాంశం.
ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం.
అయితే మరోవైపు సూరజ్ పంచోలి తల్లి మాట్లాడుతూ జియాకి ముందు నుంచే మెంటల్ గా ప్రెజర్స్ ఉన్నాయని,తన కొడుకుతో పరిచయానికి ముందే ఆమె ఇలాగే సూసైడ్ అటెంప్ట్స్ చేసిందని చెబుతూ మరింత కాంట్రవర్సీకి తెరతీసింది.అలా దాదాపు పది ఏళ్లల పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో చివరికి 2023 28న సిబిఐ ప్రత్యేక కోర్టు తగిన ఎవిడెన్స్ లేవంటూ సూరజ్ పంచోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది .ఏది ఏమైనా కోర్టు తీర్పులు ఎలా ఉన్నా 25ఏళ్ల అతి చిన్న వయసులోనే ఒక టాలెంటెడ్ యాక్టర్ ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం.
also read:ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఘోర విషాదం.. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న ప్రముఖ నటుడు!