E-Paper
Advertisement

‘మనం’ తర్వాత మళ్లీ అఖిల్ కోసమే …నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

‘మనం’ తర్వాత మళ్లీ అఖిల్ కోసమే …నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Akhil Lenin: ఒక్క హిట్టు ఒకే ఒక్క హిట్టు కావాలంటూ  ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు అఖిల్,కానీ చేసిన సినిమాలన్నీ చేసినట్టే పోవడంతో ఇక స్వయంగా  రంగంలోకి దిగాడు నాగ్.స్వయంగా తన బ్యానర్ పై తెరకెక్కిన భారీ రూరల్ యాక్షన్ డ్రామాజులై 10 20 26న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్  కాబోతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మనసులోని మాటను బయటపెట్టిన  నాగ్ 

Advertisement

ఈవెంట్లో నాగ్  తన కుమారుడి  కెరియర్ గురించి ,అలాగే ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి ఎమోషనల్ గా చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి .ఒక తండ్రిగా కొడుకు విజయమే తనకు ముఖ్యమని  ఓపెన్ గానే తన మనసులోని మాటను బయటపెట్టాడు నాగ్ .అఖిల్ సినిమాల విషయానికొస్తే ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’లలో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయాయి .వీటిలో ఒక్క ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒక్కటే కాస్త పేరు తెచ్చుకున్న సినిమా.

ఈ క్రమంలో ఎలాగైనా ఈసారి అఖిల్ కు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ ఇవ్వాలని పట్టుదలతో లెనిన్ సినిమాని మొదలెట్టెడు నాగార్జున .అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో  సితార ఎంటర్టైన్మెంట్స్  నాగ వంశీతో కలిసి స్వయంగా ఈ సినిమాను నేర్పించాడు .ఇక వినరో భాగ్యమే విష్ణు కథ సినిమాతో మెప్పించిన  మురళీకృష్ణ అబ్బూరు  ఈ సినిమాని డైరెక్ట్ చేయగా ,టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్ గా  నటించింది. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ అదిరిపోయే సౌండ్ అందించాడు.

Advertisement

మనం (2014 )కోసం ఎలా తప్పించానో మళ్లీ అంతలా

ఇక ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగ్  మాట్లాడుతూ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మనం (2014 )కోసం తాను ఎలా తప్పించానో  మళ్లీ ఈ సినిమా కోసం అంతలా కాన్సెంట్రేట్ చేశానని చెప్పుకొచ్చారు.కేవలం షూటింగ్ సెట్స్ కి వెళ్లి రావడమే కాకుండా స్టోరీ డిస్కషన్స్ లో డైరెక్టర్ తో డిస్కస్ చేస్తూ తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ వరకు ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చూసుకున్నానని చెప్పుకొచ్చాడు .ఇక మనం క్లాసిక్ హిట్ అయినట్టే లెనిన్ కూడా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుందని తెలిపాడు.

కుటుంబంలో ఎలాంటి ఆనందాన్ని నింపుతుందో

ఒక తండ్రిగా బిడ్డ కోసం ఏమేం చేయాలో అవన్నీ 100% చేశానని తెలిపాడు.అఖిల్ సినిమా జర్నీ లో ఎదురైన అప్ అండ్ డౌన్స్ పై నాగ్  మాట్లాడుతూ అఖిల్ తన ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి కష్టపడతాడని, తన 99 సినిమాల ఎక్స్పీరియన్స్ లో అఖిల్ కష్టపడటంలో ఎప్పుడు తేడా చూడలేదని చెప్పుకొచ్చాడు .అయితే లెనిన్ ఒక ఎమోషనల్ జర్నీ అని అఖిల్ పర్సనల్ లైఫ్ లో ఉన్న ఒక రకమైన పెయిన్ ఈ  సినిమాలో అతను పోషించిన క్యారెక్టర్ లోని పెయిన్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయిందని,ఆ కోఆర్డినేషన్ తెరపై అద్భుతంగా పండిందని అఖిల్ ని ఆకాశానికి ఎత్తేశాడు నాగార్జున.  చూడాలి మరి జూలై 10న థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ఈ లెనిన్ అక్కినేని వారి కుటుంబంలో ఎలాంటి ఆనందాన్ని నింపుతుందో!

Related News

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

ఇదేం ప్రమోషన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..  కిల్లింగ్ లుక్ లో హాట్ బ్యూటీ..

షట్‌డౌన్ దిశగా కోలీవుడ్?.. బంద్‌పై ‘ఫెఫ్సీ’ కీలక విజ్ఞప్తి!

‘ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!

కళ్ళు చెదిరే లుక్ లో పాయల్.. సైమా నామినేషన్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కొమరం..

కామెడీతో పాటు ఎమోషన్స్.. ఓజీ డైలాగ్స్ తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్!

Big Stories

Advertisement
×