OG 2: పొనుగంటి నిరంజన్…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని.చిన్నప్పటి నుంచి జెనెటిక్ (జన్యుపరమైన) సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ నిరంజన్ ని పలకరించి అతడికి ఇష్టమైన గిఫ్ట్స్ కొనిచ్చాడు కూడా. అయితే తాజాగా అతనికున్న సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా నిరంజన్ జ్ఞాపకార్థం చిత్ర యూనిట్ తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.
అతడిని పవన్ కల్సిన సందర్భంగా ఓజీ 2’ (OG 2) ప్రీమియర్ షోకు నువ్వే స్పెషల్ గెస్ట్ అని, ఇద్దరం కలిసి థియేటర్లో కూర్చుని ఈ సినిమా చూద్దామని నిరంజన్ కి ప్రామిస్ చేశాడు పవన్. అయితే ఆ కోరిక తీరకుండానే కన్నుమూశాడు.అయితే పవన్ ఇచ్చిన మాటని గౌరవిస్తూ ‘ఓజీ’ చిత్ర సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఎమోషనల్ గా తన నిర్ణయాన్ని అనౌన్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఆ కుర్రాడికి మాట ఇచ్చాడు కాబట్టి, ‘ఓజీ 2’ఆల్బమ్ (పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) మొత్తాన్ని చనిపోయిన ఆ అబ్బాయికి అంకితం చేస్తున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్ లో అఫీషియల్ గా పోస్ట్ వదిలాడు.”నీ ఆత్మకి శాంతి చేకూరాలి నిరంజన్.. మన లీడర్ చెప్పినట్లుగా మా ఆల్బమ్‌ని నీకు అంకితం చేస్తున్నాము” అంటూ పవన్ కళ్యాణ్, నిరంజన్ ఆసుపత్రిలో దిగిన సెల్ఫీ ఫొటోను షేర్ చేశాడు తమన్.
also read:సినిమా హిట్.. డైరెక్టర్ చేతిలో కొత్త కార్ కీ: ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గురూ !
నిరంజన్ విషయానికి వస్తే..తన చిన్నప్పటి నుండే జెనెటిక్ (జన్యుపరమైన) సమస్యలతో బాధ పడుతున్న ఈ అబ్బాయికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. తన ప్రాణం పోయేలోపు ఒక్కసారైనా తన ‘లీడర్’ పవన్ కళ్యాణ్‌ను చూడాలన్నది అతడి కోరిక.ఇక న్యూస్ అలా ఇలా సోషల్ మీడియాలో పాకడంతో తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతడిని స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సంగతి తెల్సిందే.నిరంజన్ బెడ్ పక్కన కూర్చుని ధైర్యం చెప్పడం,పవన్ కళ్యాణ్‌ను చూసిన నిరంజన్ కళ్లలో ఆనందం, ఎమోషన్ కనిపించడం మీడియాలో హైలెట్ అయింది కూడా.
ఇక తాజాగా థమన్ తీసుకున్న ఈ ఎమోషనల్ డిసీషన్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. అభిమాని కోరిక తీర్చలేకపోయినా ఇలా అయినా అతడి ఆత్మకి శాంతి చేకూర్చారు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారంతా .ఇక పవన్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్’, ‘బ్రో’ సినిమాలకి సాలిడ్ సౌండ్ ఇచ్చిన తమన్ త్వరలో సుజిత్ దర్శకత్వంలో రాబోయే ‘ఓజీ 2’కోసం ఇప్పటి నుండే బెస్ట్ ఆల్బమ్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడట తమన్.ఏది ఏమైనా అభిమానికి ఇచ్చిన కోరిక తీర్చలేకపోయినా ఇలా అయినా అతడి అతడి ఆత్మకి శాంతి చేకూర్చడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం!
also read:రోజుకు 12 బాటిళ్ళు..వ్యసనానికి బానిసై..45 ఏళ్లకే తనువు చాలించిన విలక్షణ నటుడి కన్నీటి గాథ!