E-Paper
Advertisement

HBD Nagarjuna : బర్త్ డే స్పెషల్.. నాగార్జున ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

HBD Nagarjuna : బర్త్ డే స్పెషల్.. నాగార్జున ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
Advertisement

HBD Nagarjuna : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న నాలుగు కుటుంబాలలో అక్కినేని నాగార్జున కుటుంబం ఒకటి. ఇండస్ట్రీలో ఈ కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున సినిమాలపరంగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన తండ్రితో కలిసి బాలునటుడుగా స్క్రీన్ షేర్ చేసుకున్న నాగార్జున ఆ తర్వాత ఒక్కో సినిమాతో యావత్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాంటి నాగర్జున వయసు పై పడుతున్న సరే కుర్ర హీరోలకి పోటీనిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 100వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా నాగార్జునకు బర్తడే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. నాగార్జున బర్త్డే సందర్భంగా ఆయన ఆస్తుల వివరాల గురించి ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

నాగార్జున ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున వరుసగా సినిమాలతో బిజీగా మారుతూ వస్తున్నాడు. తండ్రి ఆస్తులతో పాటుగా నాగార్జున కూడా సినిమాలతో బాగానే సంపాదించాలన్న విషయం చెప్పనక్కర్లేదు. జూబ్లీహిల్స్ లో ఉన్న అక్కినేని నాగార్జున ఇంటి విలువ దాదాపు 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయన సినిమా స్టూడియో విలువ 200 కోట్ల రూపాయలు. నాగార్జున దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఉన్నాయి.. బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ , ఆడి ఎ7, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్6 వంటి లగ్జరీ కార్లు నాగార్జున గ్యారేజ్ లో ఉన్నాయి. వీటితో పాటుగా పలు వ్యాపారాలలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. భారత దేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న సెలబ్రిటీలలో మూడవ స్థానంలో నాగార్జున ఉండడం విశేషం. ఈయన ఆస్తుల విలువ మొత్తం 3700 కోట్లకు పై మాటే అని తెలుస్తుంది.. మొత్తానికి 4000 కోట్ల వరకు నాగార్జున ప్రాపర్టీలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన సినిమాలకు కూడా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తుంది. ఒక్కో సినిమాకి దాదాపు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

అక్కినేని హీరోల సినిమాల విషయానికొస్తే..

Advertisement

అక్కినేని నాగార్జున తన వయసుతోపాటు పర్సనాలిటీని కూడా మెయింటెన్ చేస్తుంటాడు. ఈ వయసులో కూడా ఆయనను చూసిన అమ్మాయిలు ఫీదా అవుతుంటారు. అందుకే నాగార్జునను మన్మధుడు అని అందరూ ముద్దుగా పిలుస్తారు. ప్రస్తుతం నాగ్ మల్టీస్టారర్ సినిమాలతో పాటుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించేందుకు రెడీగా ఉన్నాడు.. కుబేర మూవీ తర్వాత ప్రస్తుతం ఆయన 100 వ సినిమాలో నటిస్తున్నాడు..ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య రెండవ పెళ్లి తర్వాత తండేల్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం నాగచైతన్య వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉంది.. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.అక్కినేని అఖిల్ సినిమాల విషయానికొస్తే.. సినీ ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన నాటి నుంచి మొన్నటి వరకు ఆయన ఖాతాలో సరైన బ్లాక్ బస్టర్ సినిమా పడలేదు. రీసెంట్ మాస్ యాక్షన్ చిత్రంలో నటించిన ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద అఖిల్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. నాగార్జున నటిస్తున్న 100వ సినిమా నుంచి ఆయన బర్త్డే సందర్భంగా గ్లింప్స్ వీడియోను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Related News

మహేంద్రగిరి వారాహి ట్రైలర్ రిలీజ్.. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ?

ఇరుముడి హిట్టు వెనుక రవితేజకు ఇంత లాభమా?

చిత్ర పరిశ్రమ అందరిదీ… ఒకరి సొత్తు కాదు.. విమర్శలకు చెక్ పెట్టిన చిరు!

రాఖీ రోజున సర్‌ప్రైజ్.. SKN కి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్!

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు.. గొప్ప అవకాశం అంటూ చిరు పోస్ట్!

అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ.. కింగ్ 100 నుంచి బిగ్ అప్డేట్..వీడియో వైరల్!

రాఖీ స్పెషల్.. ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్స్..

Big Stories

Advertisement
×