Bollywood Actor : సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఏ పని చేస్తారో చెప్పడం అసాధ్యం. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు అని చెప్పాలి. కొంతమంది తమకు నచ్చిన వారితో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంటే.. ఇంకొంతమంది డేటింగ్ వరకే ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొంతమంది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ నటుడు కూడా.. అందులోనూ 70 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
70 ఏళ్ళ వయసులో నాలుగో పెళ్లి చేసుకున్న నటుడు..
అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక పేజ్ లిఖించుకున్నారు. ప్రముఖ నటుడు కబీర్ బేడీ (Kabir Bedi) . బెస్ట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ను అలరించిన ఈయన.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన పెళ్లిళ్లతోనే హెడ్లైన్స్ లో నిలుస్తూనే ఉంది. ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం గమనార్హం. కన్న బిడ్డలే ఛీ కొట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఈయన తనకంటే వయసులో 29 సంవత్సరాలు చిన్నదైన పర్వీన్ దుసాంజ్ తో ఏడడుగులు వేశారు. దాదాపు 10 ఏళ్లుగా డేటింగ్ చేసుకున్నాక..ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా పర్వీన్ తన జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా మార్చేసింది అని.. అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నాను అంటూ ఒక ప్రకటనలో తెలిపారు కబీర్ బేడీ.
ఛీ కొట్టిన కూతురు..
ఇకపోతే పర్వీన్ తో కబీర్ వివాహం చేసుకోవడం ఆయన కూతురికి నచ్చలేదు. వివాదాలకు దారితీసింది. అందుకే తండ్రిని ఛీ కొట్టింది. సవతి తల్లి పై నెగిటివ్ కామెంట్లు కూడా చేసింది. వెంటనే డిలీట్ చేసింది కూడా.. ఈ విషయంలో విభేదాల వల్ల తండ్రితో ఏకంగా మూడేళ్లు మాట్లాడలేదు కూడా. అయినా సరే నాలుగవ పెళ్లి చేసుకొని తన జీవితంలో ఆయన కొత్త అధ్యయనానికి నాంది పలికారు.
కబీర్ బేడీ వ్యక్తిగత జీవితం..
కబీర్ బేడీ పెళ్లిళ్ల విషయానికి వస్తే.. 1969లో ప్రోటిమా బేడీతో ఏడు అడుగులు వేశారు. కానీ 1977లో విడిపోయారు. ఆ తర్వాత 1980లో సుసాన్ హంఫ్రీస్ తో ఏడడుగులు వేసినా 1990లో విడాకులు ఇచ్చారు. ఇక తర్వాత రెండు సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకుని తిరిగి 2005లో నిక్కీ బేడిని భాగస్వామిగా ఎంచుకున్నారు. అయితే 2005లో ఆమెకు కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లు పర్వీన్ తో డేటింగ్ చేసి.. 2016లో ఆయన 70 పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం కబీర్ బేడీ తన కూతురు పూజాబేడితో కనిపించడమే అని చెప్పాలి. ప్రస్తుతం ఈయన వయసు 79 సంవత్సరాలు కావడం గమనార్హం. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ముసలోడు ఈ వయసులో కూడా భలే అందంగా ఉన్నాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా పిల్లలతో ఛీ కొట్టించుకొని మరీ నాలుగో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.
ALSO READ:Kangana Ranaut: సినీ పరిశ్రమ ఒక డర్టీ ప్లేస్.. సంచలన కామెంట్లు చేసిన కాంట్రవర్సీ క్వీన్!
?utm_source=ig_web_copy_link