Coolie Movie : తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ.. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ మూవీలో విలన్ పాత్రలో నటించారు. ఆగస్టు 14న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. రెండు రోజులు భారీగానే కలెక్షన్లను వసూలు చేసింది. మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాని చాటాడు. మొదటి షో నుంచి ఇప్పటివరకు ఓపెనింగ్స్ కూడా బాగానే జరుగుతుండడంతో కలెక్షన్స్ ఎక్కువగా వసూల్ అవుతున్నాయని తెలుస్తుంది.. అయితే తమిళనాడు కన్నా తెలుగులో ఊహించని విధంగా బుకింగ్స్ జరిగినట్లు ఓ వార్త అయితే ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మిలియన్ పైగా బుకింగ్స్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..
తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ రికార్డ్..
రజినీ సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. గతంలో వచ్చిన జైలర్ మూవీ కన్నా కూలీకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని కలెక్షన్స్ ను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోట కూలీ రీసౌండ్ చేస్తుంది.. అలాగే తెలుగులో ఇదే టాక్ వినిపిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1 మిలియన్‌కు పైగా బుక్ మై షో టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు.. తమిళ నాడులో రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించలేరు. రజినీకాంత్ కూలీ ఫీవర్‌తో ఈ వీకెండ్ థియేటర్లు మోత మోగిపోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కూలీ కలెక్షన్స్..
రజనీకాంత్ నటించిన కూలి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.. అన్ని ఏరియాలో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నట్లు మేకర్స్ అంటున్నారు.. ప్రీమియర్ షోలతో వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక మొదటి రోజు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల వరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. ఇక రెండో రోజు కూడా అదే విధంగా రాబట్టిందని తెలుస్తుంది. 370 కోట్లతో నిర్మించిన ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. 200 కోట్ల క్లబ్ లోకీ చేరిందని టాక్.. ప్రపంచ వ్యాప్తంగా 155 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు 65 కోట్ల కలెక్షన్స్ వసూల్ అయ్యాయి. అలాగే తమిళనాడులో రెండ్రోజుల్లో 80 కోట్లు, హిందీలో 15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్లు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల ఇదే జోరులో వసూళ్లు వస్తే పక్కా 1000 కోట్లు అని తలైవా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు…
Also Read :‘కూలీ’ ఎఫెక్ట్.. లోకీని పక్కనపెట్టిసిన స్టార్ హీరోలు..?
కూలీ ఓటీటీ..
స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి వార్తలు వినిపిస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే కూలీ ఓటీటీలోకి రానుంది.