Kangana Ranaut: బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిజానికి తన అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు రాజకీయాలలో కూడా బిజీగా మారిన ఈమె.. తాజాగా సినీ ఇండస్ట్రీపై చేసిన కామెంట్లు సర్వత్రా సంచలనంగా మారాయి.
సినిమా పరిశ్రమ ఒక మురికి ప్రదేశం – కంగనా..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ మాట్లాడుతూ..” సినిమా పరిశ్రమ అంటేనే ఒక డర్టీ ప్లేస్ . ఇందులో నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ సాధారణ వ్యక్తుల పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తుంది. అందుకే ఇండస్ట్రీ ఒక మురికి ప్రదేశంగా నేను భావిస్తున్నాను ” అంటూ కంగనా రనౌత్ తెలిపింది. ఇకపోతే ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నేడు బాలీవుడ్ సినీ పరిశ్రమనే శాసించే స్థాయికి ఎదిగింది అంటే.. ఆమె సక్సెస్ వెనక ఎంత కష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త వాళ్లకు, బయట వ్యక్తులకు సినీ పరిశ్రమ అంత మంచిది కాదు అంటూ డైరెక్ట్ గానే కామెంట్లు చేసింది కంగనా.. ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కంగనా కెరియర్..
డాక్టర్ అవ్వాలనుకున్న తన తల్లిదండ్రుల కోరికను పక్కనపెట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చి 16వ ఏటనే తన కెరీర్ ను తానే నిర్మించుకోవాలని సంకల్పించింది. అలా ఢిల్లీకి వెళ్లిపోయిన ఈమె ఆ తర్వాత కొన్నాళ్లకు మోడల్ గా అవతరించింది. నాటక దర్శకుడు అరవింద్ గౌడ్ శిక్షణలో నటన నేర్చుకున్న ఈమె.. 2006లో ‘గ్యాంగ్ స్టార్’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమెకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇక ముఖ్యంగా నేషనల్ అవార్డులతో పాటు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా లభించాయి.
హిందీలోనే కాదు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా..
పేరుకే బాలీవుడ్ బ్యూటీ అయినా తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ (Prabhas ) హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తమిళ్లో ‘చంద్రముఖి 2’ తో 2023లో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇటీవల ఇందిరా గాంధీ బయోపిక్ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర పోషించడమే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ సినిమా విడుదలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఎట్టకేలకు విడుదల చేసినా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఆర్.మాధవన్ (R.Madhavan) తో కలిసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. ఈ సినిమాను తమిళ్, హిందీ భాషలలో బైలింగ్వల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ALSO READ:Mega 157: మెగా 157పై బిగ్ అప్డేట్.. సంక్రాంతికి రావడం లేదా?