BigTV English

Vishwambhara: చిరుతో ఢీ కొట్టడానికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్.. బాస్ ముందు బచ్చానేనా?

Vishwambhara: చిరుతో ఢీ కొట్టడానికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్.. బాస్ ముందు బచ్చానేనా?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన విడుదలకు సిద్ధంగా ఉంచిన చిత్రాలలో విశ్వంభర (Vishwambhara)కూడా ఒకటి. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ , గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయాన్ని అంగీకరించిన చిరంజీవి కూడా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.


గ్లింప్స్ తో అంచనాలు..

వాస్తవానికి గతంలో ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంది. ఇంత దారుణమైన వీఎఫ్ఎక్స్ పెడతారని అనుకోలేదంటూ అభిమానులు కూడా చిత్ర బృందంపై సోషల్ మీడియాలో ఏకిపారేశారు. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రాలేదు. గ్లింప్స్ వీడియో చాలా చక్కగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. ఒక మంచి అడ్వెంచర్ మూవీని చూడబోతున్నామని అభిమానులు కూడా చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు.


విలన్ ఎవరు?

ఇక అంతా బాగానే ఉంది కానీ రెండు టీజర్లు విడుదల చేసినా అందులో విలన్ ఎవరు అనే విషయాన్ని డైరెక్టర్ రివీల్ చేయలేదు. సినిమా ప్రారంభమైన కొత్తలో రానా దగ్గుబాటి (Rana daggubati)విలన్ గా నటిస్తాడు అంటూ వార్తలు రాగా అందులో నిజం లేదని తెలిసిపోయింది. మొదటి టీజర్ విడుదల చేసినప్పుడు రాజీవ్ కనకాల (Rajiv kanakala) మాత్రమే కనిపించారు. ఆయనది పాజిటివ్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. మరి విలన్ గా ఎవరు నటిస్తున్నారు ?మెగాస్టార్ తో ధీటుగా పోరాడే వ్యక్తి ఎవరు? అని నెటిజెన్స్ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు.

బాస్ ను ఢీ కొట్టడానికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్..

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక బాలీవుడ్ సీనియర్ హీరోని విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఆ విషయాన్ని సర్ప్రైజ్ గా ఉంచాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు విలన్ ఎవరు అనే విషయాన్ని చూపించలేదని, అటు సినీ ఇండస్ట్రీ వర్గాలలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే మెగాస్టార్ తో ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్న ఆ స్టార్ హీరో ఎవరు అన్న విషయంపై ఇప్పుడు సస్పెన్స్ ఏర్పడిందని చెప్పవచ్చు.

విశ్వంభర సినిమా విశేషాలు..

విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సంపాదకుడిగా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి – ఎంఎం కీరవాణి కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ చిత్రంగా ఈ సినిమా విశేష గుర్తింపును సొంతం చేసుకుంది. ‘బింబిసారా’ సినిమాతో డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మొదటి భాగంలో త్రిష రెండవ భాగంలో ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం..ఇక వీరితోపాటు సురభి, హర్షవర్ధన్, ప్రవీణ్ , వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

Comedian Ramachandra: పక్షవాత బారినపడ్డ వెంకీ కమెడియన్.. రవితేజను హెల్ప్ అడిగితే?

HBD Chiranjeevi: ఊరికే మెగాస్టార్ అయిపోయారు.. ఆ బిరుదు వెనుక ఎంత కష్టం ఉందంటే?

Mega157 Glimpse:ఎవరీ శంకరవరప్రసాద్… అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. బాస్ ఈజ్ బ్యాక్!

Megastar Chiranjeevi: చిరంజీవిని చంపాలని చూశారా..? బర్త్ డే వేళ బయటపడ్డ నిజం..

HBD Chiranjeevi : తెలుగు నటరస నవరాజా శంకరుడే ఈ చిరంజీవుడు

Big Stories

×