Chiranjeevi’s Mega157 Glimpse:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈరోజు చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ని ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు అంచనాలు పెంచేసింది.. ముఖ్యంగా వింటేజ్ లుక్ లో చిరంజీవిని చూపిస్తానని మాట ఇచ్చిన అనిల్ రావిపూడి అందుకు తగ్గట్టుగానే చిరంజీవిని చాలా అద్భుతంగా చూపించబోతున్నారని ఈ ఒక్క వీడియో స్పష్టం చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇందులో బాస్ ఈజ్ బ్యాక్ అంటూనే “మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు” అంటూ వెంకటేష్ (Venkatesh) వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది. మొత్తానికైతే బర్తడే స్పెషల్ గా విడుదలైన ఈ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
వింటేజ్ లుక్కు లో ఆకట్టుకుంటున్న మెగాస్టార్..
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుండి విడుదల చేసిన ఈ వీడియో విషయానికి వస్తే.. గ్లింప్స్ అలా మొదలైందో లేదో అప్పుడే మెగాస్టార్ వింటేజ్ లుక్ లో ఆకట్టుకున్నారు.. ఆ స్టైలిష్ నెస్ కి అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. కారులో నుంచి స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకొని దిగుతున్న ఫోజుకి అభిమానులు కేకలు వేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సీన్ థియేటర్లలో పేలడం గ్యారెంటీ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన నడక , మేనరిజం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. దీనికి తోడు ఈ సినిమాలో అతిధి పాత్ర పోషిస్తున్న వెంకటేష్(Venkatesh ) టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అంటూ చెప్పిన డైలాగ్ మరింత ఆకట్టుకుంది. చిరంజీవి పాత సినిమాలకు సంబంధించిన లుక్ ను అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా రివీల్ చేశారు. మొత్తానికైతే చిరంజీవి బర్త్డే స్పెషల్గా విడుదలైన ఈ స్పెషల్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు..
మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassishta mallidi) దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకా మిగిలిన 20 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తామని నిన్న చిరంజీవి ప్రకటించారు. ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
also read:Allu Arjun: మెగా మామకి స్పెషల్ విషెస్.. రూమర్స్ కి చెక్ పెట్టిన బన్నీ!