BigTV English

Bollywood: మూఢనమ్మకాలకి పోయి కెరీర్నే నాశనం చేసుకున్న స్టార్ హీరో!

Bollywood: మూఢనమ్మకాలకి పోయి కెరీర్నే నాశనం చేసుకున్న స్టార్ హీరో!

Bollywood..మూఢనమ్మకం.. మనిషిని కళ్ళున్న గుడ్డివాడిని చేస్తుందనడంలో సందేహం లేదు. ఒకసారి మనసులో మూఢనమ్మకం అనే బీజం నాటుకుపోతే.. ఇక దానిని ఏం చేసినా తీయలేమని.. ఇటీవలే ఒక స్టార్ హీరో నిరూపించారు. ఇలా మూఢనమ్మకాలకు పోయి కెరియర్ నే నాశనం చేసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు గోవిందా (Govinda).. ఈయన అంటే ఇప్పటి సినీ ప్రేమికులకు అంతగా తెలియకపోవచ్చు.కానీ 1980,90స్ లో ఈయన అంటే తెలియని వాళ్ళు ఉండరు. చాలా సంవత్సరాలు బాలీవుడ్ ని ఏలిన హీరోలలో గోవిందా కూడా ఒకరు. అయితే బాలీవుడ్ అంటే అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), సల్మాన్ ఖాన్(Salman Khan),షారుఖ్ ఖాన్ (Shahrukh Khan), అమీర్ ఖాన్ (Aamir Khan)వీరి పేర్లు మాత్రమే వినిపించే సమయంలో గోవిందా వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. అంతేకాదు గోవిందా తన సినిమాలతో హీరో అంటే కేవలం ఫైట్లు, ప్రేమ కథలు మాత్రమే కాదు కామెడీ కూడా చేయగలడని నిరూపించారు.


ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన గోవిందా.. కారణం..

అయితే అలాంటి హీరో గోవిందా ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి మనకు తెలిసిందే.. ఆయన కంటే ముందు వచ్చిన అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్(Sanjay Dutt) లాంటి హీరోలు కూడా మళ్లీ కంబ్యాక్ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న తరుణంలో గోవిందా లాంటి స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటని ఆయన అభిమానులు నిరాశ పడుతూ ఉంటారు. అయితే గోవిందా సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం వాళ్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నిర్మాత. మరి ఇంతకీ గోవిందా సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


గోవిందా ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం అదే – నిర్మాత

బాలీవుడ్ నటుడు గోవిందా సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. అలాంటి ఈయన గత ఆరేళ్ల ముందు రంగీలా రాజ్(Rangeela Raj) అనే సినిమా చేసి అప్పటినుండి మళ్ళీ ఏ సినిమాలో కూడా కనిపించడం లేదు.. అయితే ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన ఈయన సినిమాలెందుకు మానేశారనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక గోవిందా సినిమాలు మానేయడానికి కారణం అదే అంటూ తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టారు నిర్మాత పహ్లాజ్ నిహలనీ(Pahlaj Nihalani).

ALSO READ  Sarkaar 5 Promo: రాష్ట్రాలు దాటుతున్న సుధీర్ -రష్మీ ప్రేమాయణం.. విజయ్ ఆంటోనీ ఓపెన్ కామెంట్స్!

ఆ మూఢ నమ్మకమే సినీ జీవితాన్ని నాశనం చేసింది..

తాజాగా ఈ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “గోవిందా ఎంతో స్టార్డం అనుభవించారు. కానీ సడన్గా ఆయన సినిమాలకు దూరం అవ్వడానికి కారణం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు.. చుట్టూ ఉన్నవాళ్లు ఏ మాట చెబితే అదే వినేవారు. ఇతరులను గోవిందా ఎక్కువగా నమ్మేవారు. పండితులు, జ్యోతిష్యులు ఏం చెబితే దానికి తల ఊపుతూ ఉండేవారు. అందుకే ఆయన సినీ కెరీర్ నాశనమైంది. ఇతరులను గుడ్డిగా నమ్మడం ఈయన కెరియర్ పై ప్రభావం చూపింది.అందుకే ఆయన పరిస్థితి ఇలా తయారైంది. గోవిందాకి ఈ గతి పట్టడానికి కారణం ఎదుటివారిని తొందరగా నమ్మడమే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత పహ్లాజ్ నిహలనీ..

గోవిందా సినిమాలు..

ఇక గోవిందా సినిమాల విషయానికొస్తే.. మహాభారతం(Maha Bharatham) సీరియల్ లోని అభిమన్యుడి పాత్రకి ఆడిషన్ ఇచ్చి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా రంగీలా రాజ్ సినిమా చేసి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Related News

Lokesh Kanagaraj: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు

Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను

Kapil Sharma -Kap’s Cafe: కపిల్ శర్మ కేఫ్ పై మరోసారి ఉగ్రదాడి… ఈసారి ముంబైలో అంటూ హెచ్చరిక!

Paradise: నాని ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా, శ్రీకాంత్ అదిరిపోయే ప్లానింగ్

Actor Prithivi : సినిమాలు వదిలేద్దాం అనుకునే టైంలో సందీప్ రెడ్డి నిలబెట్టాడు

Rajinikanth: రజినీ కాంత్ 50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి.. 5,500 ఫోటోలతో అభిమాని వింత పని!

Big Stories

×