Sarkaar 5 Promo: జబర్దస్త్ (Jabardast) ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్నారు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ఇక్కడ తన పర్ఫామెన్స్ తోనే కాదు ప్రముఖ యాంకర్ రష్మి (Rashmi) తో నడిపిన ప్రేమాయణం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. సినీ ప్రేమికులే కాదు సెలబ్రిటీలు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ తామద్దరం స్నేహితులమని, ఆన్ స్క్రీన్ కోసమే అలా చేశామని, ఇప్పటికే ఈ జంట ఎన్నో సార్లు చెప్పినా.. అటు రష్మీ కనిపిస్తే సుధీర్ గురించి.. ఇటు సుధీర్ కనిపిస్తే రష్మీ గురించి అడగడం పరిపాటి అయిపోయింది.
సర్కార్ -5 ప్రోమో రిలీజ్..
అయితే ఇప్పుడు తాజాగా రష్మీ – సుధీర్ ప్రేమాయణం రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా పాకిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, సింగర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. విజయ్ ఆంటోనీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్న ఈయన తాజాగా ‘మార్గన్’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న ‘సర్కార్ 5’ కార్యక్రమానికి టీం తో సహా విచ్చేశారు.
రష్మీ – సుధీర్ ప్రేమాయణం పై విజయ్ ఆంటోనీ కామెంట్స్..
ఈ కార్యక్రమానికి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే నాల్గవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో విజయ్ ఆంటోనీ తన టీం తో కలిసి స్టేజ్ పైకి రాగానే.. సుధీర్ ఆప్యాయంగా పలకరిస్తూ.. నేను మీకు పెద్ద అభిమానిని అని కామెంట్లు చేశారు. మీ సినిమాలకు నేను పెద్ద అభిమానిని అని సుదీర్ చెబుతుండగానే.. వెంటనే విజయ్ ఆంటోనీ కలగజేసుకొని.. “నేను కూడా మీకు పెద్ద అభిమానిని. మీరు చేసే అన్నిషోలు నేను చూస్తూ ఉంటాను. ముఖ్యంగా రష్మీ తో మీ కెమిస్ట్రీ మరింత అందంగా ఉంటుంది” అంటూ తెలిపారు. ఇకపోతే విజయ్ ఆంటోని నోట వీరిద్దరి రిలేషన్ గురించి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇద్దరి కెమిస్ట్రీ ఇప్పుడు రాష్ట్రాలు దాటుతోంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ Salman khan: అందుకే పెళ్లి చేసుకోలేదు..పెళ్లి పై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
సుధీర్ ను ఒక ఆట ఆడుకున్న విజయ్ ఆంటోని..
ఇకపోతే విజయ్ ఆంటోని మరొకసారి తన కామెడీతో మార్క్ చూపించారు. సుధీర్ మాట్లాడుతూ.. ఇక ఇన్ని షోలు నేను ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసా సార్ అని చెప్పగానే.. బిచ్చగాడు సినిమాలోని “ఒక్క పూట అన్నం కోసం” అంటూ విజయ పాట పాడి సుదీర్ పరువు తీశారు.ఇక తర్వాత ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ కూడా వచ్చి సందడి చేశారు. మొత్తానికైతే ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు ప్రోమో చూసిన ఆడియన్స్ అంతా.. ఇంత కామెడీకి చచ్చిపోతే ఎవరు గ్యారెంటీ అంటూ కూడా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మార్గన్ మూవీ టీం కి సంబంధించిన ఈ ప్రోమో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది.