Ishan Kishan catch Controversy: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( IND VS WI) మధ్య లక్నో వేదికగా తొలి టీ20 ఇవాళ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఏకంగా 8 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీ చేయగా… ఇషాన్ కిషన్ 37 పరుగులతో ఇరగదీశాడు. దీంతో వెస్టిండీస్ విధించిన లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలో చేదించి, 8 వికెట్ల తేడాతో విక్టరీని నమోదు చేసుకుంది టీమిండియా. దీంతో ఐదు టి20 సిరీస్ లో 1-0 తేడాతో లీడింగ్ లోకి వెళ్ళింది టీమిండియా.
వెస్టిండీస్ తో జరిగిన తొలి T20లో టీమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలోనే 171 పరుగులు సాధించిన వెస్టిండీస్ ఆల్ అవుట్ అయింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా దూకుడుగా ఆడింది. ఈ తరుణంలో 14.4 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సిక్సర్లతో పాటు 10 బౌండరీలు ఉన్నాయి. 237.21 స్ట్రైక్ రేట్ తో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇరగదీశాడు. దీంతో టీమిండియా సులభంగా విజయం సాధించింది.
వెస్టిండీస్ తో జరిగిన మొదటి టి20 సందర్భంగా టీమిండియా డేంజర్ ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan) క్యాచ్ వివాదంగా మారింది. ఈ క్యాచ్ వెస్టిండీస్ ఓటమికి కారణమైందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చేజింగ్ చేస్తున్న సమయంలో భారీ షాట్ ఇషాన్ కిషన్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ గేట్ దగ్గర ఉన్న మ్యాథ్యూ ఫోర్డె అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అయితే, క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తగిలినట్టు అంపైర్ గుర్తించారు.
ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ ( Ishan Kishan catch Controversy) నాటౌట్ అంటూ ప్రకటించేశాడు. దీంతో మంచి లైఫ్ అందుకున్న ఇషాన్ కిషన్ 37 పరుగులతో రాణించాడు. ఈ దెబ్బకు టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ క్యాచ్ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని వెస్టిండీస్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనిపించారు. అటు హెడ్ కోచ్ డారెన్ సమీ కూడా సీరియస్ లుక్స్ ఇస్తూ రెచ్చిపోయాడు. ఇక వెస్టిండీస్ అభిమానులు అయితే ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.
Catch dropped of Ishan Kishan
Well true west indies team !! pic.twitter.com/rXZQNFcXcI
— Kamala's Chatter 🇮🇳 Vande Bharatam! (@Kamalak77750268) October 6, 2026
🚨😳 BIG CONTROVERSY OVER ISHAN KISHAN’S CATCH!
Forde claimed the catch, but the umpire ruled it NOT OUT! ❌
West Indies felt Forde’s fingers were underneath the ball and Kishan should have been OUT! 👀🔥
WHAT’S YOUR VERDICT — OUT OR NOT OUT? 🤔
📸 Image Credit: JioStar… pic.twitter.com/UB7Nv5c4My
— CricInformer (@CricInformer) October 6, 2026