BigTV English

Brahmanandam: ఆర్ నారాయణ మూర్తి అందమైన హీరో… పీపుల్స్ స్టార్‌పై బ్రహ్మానందం షాకింగ్ కామెంట్!

Brahmanandam: ఆర్ నారాయణ మూర్తి అందమైన హీరో… పీపుల్స్ స్టార్‌పై బ్రహ్మానందం షాకింగ్ కామెంట్!

Brahmanandam: పీపుల్స్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఆర్.నారాయణమూర్తి (R.Narayana Murthy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకుండా.. కేవలం కథలను మాత్రమే నమ్ముకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును అందుకున్నారు. అలాంటి ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’. ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) నారాయణమూర్తితో తనకున్న అనుబంధాన్ని పంచుకోవడమే కాకుండా ఆయనపై ఊహించని కామెంట్లు చేశారు.


ఆర్.నారాయణమూర్తి పై బ్రహ్మానందం కామెంట్..

ప్రెస్ మీట్ లో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ..” అందమైన హీరో ఎవరో చెప్పమని నన్ను అడిగితే.. నేను ఆర్ నారాయణమూర్తి పేరు చెబుతాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందం అంటే ఆరడుగుల ఎత్తు, మంచి బాడీ, గ్లామర్ కాదు. మదర్ తెరిసాని మీకు అందమైన వ్యక్తి ఎవరు? ఎవరు మీకు అందంగా కనిపిస్తారు? అని అడిగితే.. ఎవరైతే మనసులో సేవా భావంతో నిండివుందో.. ఎవరి కళ్ళల్లో అయితే దయా గుణం ఉంటుందో వారే నిజమైన అందమైన వారు” అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బ్రహ్మానందం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


వ్యక్తి కాదు శక్తి..

నారాయణమూర్తి ఎన్నో త్యాగాలు చేశారు.. ఆయన జీవితం మీకు అంకితం. చివరి శ్వాస తీసుకునే వరకు మీకోసం కష్ట పడుతూనే ఉంటారు. ఇది ఎంతో అందమైన సినిమా. ఇందులో నిజాలు ఉంటాయి. జీవితపు లోతులు ఉంటాయి. పెద్దవాళ్ళకు “కావాలంటే నాలో అమ్మడానికి చాలా ఉన్నాయి. కిడ్నీ కూడా ఉంది” అంటూ సాగే డైలాగులు వింటే మాత్రం హృదయం ద్రవిస్తుంది. ఈ సినిమాను అందరూ చూడాలి. అర్థం చేసుకోవాలి. సమాజం బరువు మోసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం. ఆర్ నారాయణ మూర్తి అంటే వ్యక్తి కాదు.. శక్తి అంటూ బ్రహ్మానందం ఆర్.నారాయణ మూర్తిపై ప్రశంసలు కురిపించారు.

అవే చెప్పులు.. అదే ఆటో…

ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తున్న యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా గురించి బ్రహ్మానందం మాట్లాడుతూ..” ఒకప్పుడు ఎక్కడెక్కడ నుంచో మన దేశానికి వచ్చి చదువుకునే వారు.. ఈరోజు మన దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.. అది ఎలా ఉంది అనే అంశంపైనే నారాయణమూర్తి ఈ సినిమాను రూపొందించారు. ఆయన తేనెటీగ లాంటివారు. అన్ని ప్రాంతాలకు తిరుగుతూ తేనె తీసుకొచ్చి అందరికీ పం చాలని సంకల్పం ఉన్న ఒక గొప్ప వ్యక్తి. 40 సంవత్సరాలుగా నాకు ఆర్ నారాయణ మూర్తి తెలుసు. నిరంతరం ప్రజల గురించే ఆలోచించే ఆయన.. ఈ సినిమా కూడా ప్రజల కోసమే తీశారు. ఆర్.నారాయణమూర్తి నాకు అప్పుడు ఎలా పరిచయమయ్యారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. అవే చెప్పులు.. అదే ప్యాంట్.. షర్టు.. అదే ఆటో.. ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయితే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అందరికీ తెలుసు. కానీ 40 ఏళ్లుగా ఎన్నో చవిచూసిన ఆర్.నారాయణమూర్తి ఇప్పటికీ అలాగే ఉన్నారు అంటే ఆయనలోని వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి” అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

ALSO READ:Aishwarya Rai: అసలైన ఆత్మగౌరవం దొరికేది అక్కడే.. సోషల్ మీడియాపై ఐశ్వర్య ఫైర్!

Related News

Arundhathi Child Artist: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కిన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్!

Little Hearts Teaser: అన్ని తిట్లు మీ అమ్మకే రా, ఇంత దారుణంగా తయారయ్యారు ఏంటయ్యా?

AR Murugadoss : తెల్లార్లు అంటే కుదరదు… ఆ హీరోపై డైరెక్టర్ అసహనం

Telugu Film Industry : దాసరి గారు లేరు… ఇక మెగాస్టార్ కాకపోతే ఇంకెవరు ?

Producer SKN: ఇది సమ్మె కాదు.. నిర్మాతలకు సమ్మెట పోటు..తమ్మారెడ్డికి ఎస్కేఎన్ కౌంటర్

Big Stories

×