Indian Railways: రైలు ప్రయాణం అనేది చాలా మందికి ప్రత్యేక అనుభవం. కిటికీ పక్కన కూర్చొని పచ్చని పొలాలు, కొండలు, నదులు చూస్తూ ప్రయాణించడం మనసుకు ఓ ప్రత్యేకమైన ఆనందం ఇస్తుంది. ఎక్కువ దూరాలను తక్కువ ఖర్చుతో చేరే అవకాశం కల్పిస్తుంది. అయితే రైలు టికెట్ బుక్ చేసిన తర్వాత అనుకోకుండా ప్రయాణం రద్దు చేయాల్సిన పరిస్థితి చాలా సార్లు వస్తుంది. అలాంటి సమయంలో టికెట్ రద్దు చేస్తే ఎంత డబ్బు తిరిగి వస్తుంది, ఎంత రుసుము కట్ అవుతుంది అనే ప్రశ్న సహజమే. ఈ లెక్క మొత్తం టికెట్ తరగతి, రద్దు చేసే సమయం, ఆన్‌లైన్ ద్వారా చేస్తున్నారా లేక కౌంటర్‌లో చేస్తున్నారా అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రయాణానికి కొద్దిరోజులు ముందే రద్దు చేస్తే తక్కువ రుసుములు మాత్రమే తీసేసి మిగిలిన మొత్తం మీ ఖాతాకు తిరిగి వస్తుంది. ఎలాగంటే.. ఒక టికెట్ ధర వెయ్యి రూపాయలైతే, 48 గంటల కంటే ముందే రద్దు చేస్తే నిర్ణయించిన చార్జీలు మాత్రమే కట్ అవుతాయి. కానీ ప్రయాణానికి రేపు ఉందని, లేక రెండు రోజులు సమయం ఉంటే.. ఆసమయంలో టికెట్ రద్దు చేస్తే రుసుములు పెరుగుతూనే ఉంటుంది. 12 గంటల లోపు రద్దు చేస్తే రీఫండ్ తక్కువ మొత్తంలోనే వస్తుంది. ట్రైన్ బయలుదేరే సమయానికి రద్దు చేస్తే కొన్నిసార్లు డబ్బులు అసలు రాకపోవచ్చు కూడా. అందుకే వీలైనంత త్వరగా రద్దు చేయడం ఎప్పుడూ మంచిదే.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ అయితే అది కన్‌ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్‌గా రద్దవుతుంది, డబ్బులు రీఫండ్ అవుతాయి. అప్పుడు ఐఆర్‌సీటీసీ నియమాల ప్రకారం కొంత రుసుము తీసేసి మిగిలిన డబ్బులు తిరిగి ఖాతాకు జమ అవుతాయి. ఆర్‌ఏసీ టికెట్ల విషయంలో మీరు స్వయంగా రద్దు చేయాలనుకుంటే సాధారణ నిర్ధారణ టికెట్ లాగే రుసుములు వర్తిస్తాయి. అంటే రద్దు సమయానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువ కట్ అవుతుంది.
Read also: DMart vs Metro: డిమార్ట్, మెట్రో.. ఏ స్టోర్ లో సరుకులు చౌకగా దొరుకుతాయంటే?
తత్కాల్ టికెట్ రద్దు చేస్తే డబ్బులు తిరిగి రావడం చాలా కష్టం, అందుకే నిజంగా అత్యవసర పరిస్థితుల్లోనే అలాంటి టికెట్ బుక్ చేయాలి. తత్కాల్‌లో వేసే అదనపు ఛార్జీలు తిరిగి రావు. టికెట్ రద్దు చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడం అనేది చాలావరకు సాధ్యం కాదు. అయితే ట్రైన్ రద్దయితే లేదా ట్రైన్ ఎక్కువసేపు ఆలస్యమైతే మాత్రమే ప్రత్యేక పరిస్థితే రీఫండ్ వస్తుంది. అందుకే తత్కాల్ బుకింగ్ నిజంగా అత్యవసరం అయితేనే చేయడం మంచిది.
రద్దు చేసిన తర్వాత రీఫండ్ ప్రక్రియ కూడా కొంత సమయం పడుతుంది. సాధారణంగా కొన్ని పని రోజులలోనే డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయంలో ఐఆర్‌సీటీసీ నుంచి వచ్చే నోటిఫికేషన్లు, మెసేజ్‌లు గమనించడం అవసరం. ఏదైనా లోపం గాని, ఆలస్యం గాని ఉంటే బుక్ చేసిన ప్లాట్‌ఫార్మ్‌లోని కస్టమర్ కేర్‌ను లేదా ఐఆర్‌సీటీసీ అధికారిక సేవలను సంప్రదించాల్సి ఉంటుంది.
మొత్తానికి టికెట్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగానే రద్దు చేయడం వల్లే ఎక్కువ లాభం ఉంటుంది. చివరి నిమిషంలో చేస్తే రీఫండ్ చాలా వరకు తక్కువగా వస్తుంది. వెయిటింగ్ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దయి డబ్బులు తిరిగి వస్తాయి. ఆర్‌ఏసీ టికెట్లు సాధారణ రద్దు నిబంధనలకే లోబడి ఉంటాయి. తత్కాల్ టికెట్లు అయితే కఠినమైన షరతులకే పరిమితం. కాబట్టి బుకింగ్ చేసేటప్పుడే ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే అనవసర నష్టాలు తప్పించుకోవచ్చు.