E-Paper
Advertisement

‘పెద్ది’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్.. దానికి ఫుల్ క్లారిటీ ఇదే..

‘పెద్ది’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్.. దానికి ఫుల్ క్లారిటీ ఇదే..
Advertisement

Peddi Sequel: ‘పెద్ది’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్.. ఈ సారి ఆ ట్రీట్ ఉంటుందా?ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఏ పెద్ద సినిమా చూసినా పార్ట్-1, పార్ట్-2 అంటూ ఫ్రాంచైజీలుగా రావడం సర్వసాధారణం అయిపోయింది. కథతో సంబంధం లేకుండా చాలా సినిమాలు రెండు భాగాలుగా అనౌన్స్ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్‌కు భిన్నంగా వెళ్తున్నారు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (PEDDI) కేవలం ఒకే భాగంలో రాబోతుందని ఆయన అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు దర్శకుడు.

Read also-Priyanka Jain : ప్రియాంక జైన్ ఆస్తులు.. యూట్యూబ్ ద్వారా నెలకు ఎన్ని లక్షలంటే..?

ప్రాపర్ ఎండింగ్

Advertisement

ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదలవుతున్న సందర్భంగా బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, సినిమా లెంత్, పార్ట్స్ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. ‘పెద్ది సినిమాను ఒకే భాగంలో, సరైన ముగింపుతో రూపకల్పన చేశాం. దీనికి ఎలాంటి సీక్వెల్ లేదా రెండో భాగం అవసరం లేదు. కథను అనవసరంగా సాగదీసి, పార్ట్-2 కోసం ప్రేక్షకులను థియేటర్ల చుట్టూ తిప్పడం, వారిని ఎదురుచూసేలా చేయడం నాకు ఇష్టం లేదు’ అని బుచ్చిబాబు పేర్కొన్నారు.

Read also-This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

కోర్ ప్లాట్ చుట్టూనే ఎమోషన్స్..

Advertisement

సినిమా కథాంశం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. “కథలోని మూల కథాంశం చుట్టూ ఎలాంటి అనవసరమైన ఎలిమెంట్స్ లేదా కమర్షియల్ హంగులను జోడించలేదు. ‘పెద్ది’ లాంటి బలమైన కథలను ఒకేసారి చెబితేనే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సినిమా మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను ప్యాక్డ్ ఎమోషన్స్‌తో కట్టిపడేస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో పాటు, సినిమాపై అంచనాలను అకాశానికి పెంచుతూ ఈరోజే ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఇప్పుడు రాబోతున్న ట్రైలర్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇవ్వనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నేడు రాబోయే ట్రైలర్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×