C Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో సి కళ్యాణ్ ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగులో నిర్మించారు శ్రీ కళ్యాణ్. అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడుగా మహేష్ బాబు హీరోగా చేసిన ఖలేజా సినిమా నిర్మాత కూడా ఈయనే.
ఇండస్ట్రీలో కొన్ని సమస్యలపై స్పందించే మొదటి వ్యక్తిగా ఈయన ఉంటారు. గత కొన్ని రోజులుగా సినిమా కార్మికులు తమ యొక్క జీతాలు పెంచాలి అని నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కొన్నిచోట్ల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీనిపై నిర్మాత సి కళ్యాణ్ గత రెండు రోజుల నుంచి, అనేక మీటింగ్స్ పెడుతున్నారు. అలానే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు.
అలా మాట్లాడటం కరెక్ట్ కాదు
ప్రస్తుతం అందుతున్న సమాచారం నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం ముగిసింది. దీనిలో సి కళ్యాణ్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. “సినీ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతా భావం లేదు, నిర్మాత విశ్వప్రసాద్ ..ఇక్కడ కార్మికులకు టాలెంట్ లేదు అనడం కరెక్ట్ కాదు. సినీ పెద్దలు ఈ సమస్యకు పరిష్కారం చూపెడతారు. గతంలో దాసరి నారాయణ ఉండి ఇలాంటి సమస్యలను పరిష్కరించేవారు. రేపటిలోగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. అంటూ సి కళ్యాణ్ తెలిపారు.
విశ్వ ప్రసాద్ కామెంట్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ బ్యానర్ దాదాపు 50 సినిమాలను నిర్మించింది. ఈ బ్యానర్ నుంచి ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో సినిమా కార్మికుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టీజీ విశ్వప్రసాద్. కొన్నిసార్లు డాన్సర్లు కావాలి అనుకుంటే ముంబై నుంచి తీసుకురావలసి వస్తుంది. ఒక వంద మంది డాన్సర్ ని తెస్తే ముందు కేవలం కనిపించేది 30,40 మంది మాత్రమే.
ఇక్కడ ఒక డాన్స్ కార్డు కోసం దాదాపు 7 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. అలానే కొన్నిచోట్ల ఇండస్ట్రీలో మాఫియా జరుగుతుంది. డ్రైవర్స్ విషయంలో కూడా చాలా జరుగుతుంటాయి. షూటింగ్ కి తన వెహికల్ పెట్టాలి, అలానే క్యారీ వన్స్ విషయంలో కూడా చాలా జరుగుతుంది. మనం దీనిపైన చర్యలు తీసుకుందాం అని అనుకుంటే నా షూటింగే ఐదు,ఆరు షెడ్యూల్ కి సమస్య వచ్చింది. నేను ఇప్పటికే కొన్ని కార్లను తీసుకొని డ్రైవర్స్ ను హైయర్ చేసుకొని మంత్లీ శాలరీ లాగా ఇస్తున్నాను. ఇంతే కాకుండా పలు రకాల ఇంటర్వ్యూస్ లో టాలెంట్ గురించి అంశాలను సుదీర్ఘంగా చర్చించారు
Also Read: Mrunal Thakur :నాకు అలాంటి డైరెక్టర్ తో పని చేయడం ఇష్టం