BigTV English

Pumpkin Seeds: డైలీ గుమ్మడి గింజలు తింటే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Pumpkin Seeds: డైలీ గుమ్మడి గింజలు తింటే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Pumpkin Seeds:గుమ్మడి గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఈ గింజలను రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ డైలీ గుమ్మడి గింజలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: 

మెగ్నీషియం, గుండె ఆరోగ్యం:
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఈ ఖనిజం గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. ఇది రక్తపోటును నియంత్రించడంలో.. అంతే కాకుండా గుండె లయను సరిగా ఉంచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే గుమ్మడి గింజలను రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


నిద్రను మెరుగుపరుస్తుంది:
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్‌గా మారి.. తర్వాత మెలటోనిన్‌గా మారుతుంది. మెలటోనిన్ అనేది నిద్రను నియంత్రించే హార్మోన్. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా గుమ్మడి గింజలు తింటే మంచిగా నిద్ర పడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఈ గింజల్లో జింక్ అనే ఖనిజం అధికంగా ఉంటుంది. జింక్ మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి.. గాయాలను త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. గుమ్మడి గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచుగా గుమ్మడి గింజలు తినడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

ప్రోస్టేట్ ఆరోగ్యం:
ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే జింక్ ప్రోస్టేట్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఈ గింజలు బినిన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా అనే సమస్యను తగ్గించగలుగుతాయి.

Also Read: పుదీనా టీ తాగితే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు !

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి టైప్- 2 డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం. వీటిలోని పోషకాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అధికంగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారణ:
గుమ్మడి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటిలో ఉండే క్యుకుర్బిటిన్ అనే కాంపౌండ్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తారు.

Related News

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Weight Loss Tips: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్

Strawberries: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

Open Pores On Face: ఓపెన్ పోర్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?

Big Stories

×